special Stories

special Stories

‘ కృత్రిమ మేధ కాలంలో ‘ రణక్షేత్రం నుంచి డిజిటల్‌ సవాళ్ల’ వరకు పత్రికా స్వేచ్ఛ

ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది పాత్రికేయుల సేవ. దేశానికి అన్నదాతలు వెన్నెముక అయితే వార్తా సమాచారాన్ని ప్రజలకు అందించే పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలు కాగా నాలుగో స్తంభంగా ప్రసార మాధ్యమాలు నిర్వర్తించే పాత్ర అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వానికి ప్రజలకు నడుమ వారధిగా నిలుస్తూ పారదర్శకతకు,…

కాశ్మీర్‌ను మిలిటరీ కేంద్రంగా మార్చాలి!

నిరంతర నిఘా పెంచాలి…   ఉగ్రవాదుల ఏరివేతకు జల్లెడ పట్టాలి పర్యాటక స్వర్గధామం అయిన జమ్మూ కాశ్మీర్‌లో నరమేథం సృష్టించడం ద్వారా అక్కడ సాధారణ పరిస్థితులు రాకుండా…సామాన్య జనం అక్కడ లేకుండా..ముఖ్యంగా హిందువులను లేకుండా చేయాలన్న ముస్లిం ఉగ్రవాదుల కుట్రలో భాగమే తాజా నరమేధానికి నిదర్శనం. 370 ఆర్టికల్‌ రద్దు తరవాత కాశ్మీర్‌ అభివృద్ది చెంది,…

చికిత్స!

ఉత్కంఠ రేపే చిన్న కథన శకలం చివర ఒక మెరుపు తీగె అల్లుకుంటుంది. ఈ శీర్షికని ప్రముఖ కథా రచయిత బమ్మిడి జగదీశ్వరరావు రాసిన కథలతో మొదలు పెడుతున్నాము. కొన్ని వారాలు ప్రచురిస్తాము. ఈ పద్ధతిలోకి వచ్చే కథలు ఎవరైనా పంపవచ్చు. వాటిని కూడా పరిశీలనలోకి తీసుకుంటాము. ‘నీ నడకలో తేడా వచ్చింది,’ అన్నాడు యెదురుపడిన మిత్రుడు. నవ్వాను.…

ఆలయం అడుగున

గుజరాతీ మూలం : ప్రతిష్ట పాండ్య తెలుగు అనువాదం: శృతకీర్తి తవ్వు గుడి కింద తవ్వు మసీదు కిందా గుడి కిందా లోతుగా ఇంకా లోతుగా తవ్వు చర్చి కింద తవ్వు దర్గా కూల్చి నువ్వేసిన రోడ్డు కింద తవ్వు ఎక్కడో నువ్‌ పాతిపెట్టిన గురు గ్రంథ్‌ సాహిబ్‌ కింద తవ్వు చేయి చేయి పట్టుకుని…

అంతర్‌ బహిర్‌ యుద్ధారావం షాజహానా కవిత్వం

‘‘చదువు లేదు ఏ ఇఛ్ఛా ఉండకూడదు/ ఎడ్లమూతికి బుట్టలాగా/గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా నఖాబ్‌లు’’ 1997లో షాజహానా ‘పర్దా హటాకే దేఖో’ కవిత వ్రాసి పరదాల చాటు ముస్లిం స్త్రీల జీవితంలోని హింసను గురించి మాట్లాడటం మొదలు పెట్టిననాటి నుండే నాకు ఆమె పరిచయం.  1993 నాటికి స్త్రీలపై వివక్షకు, హింసకు మూలమైన పితృస్వామ్యాన్ని…

ఏనుగెక్కిన సంపద

(డా.కె.ఎన్‌. గణేశయ్య రాసిన ‘‘కరి సిరి యాన’’ అనే కన్నడ నవలను రంగనాథ రామచంద్రరావు ‘ఏనుగెక్కిన సంపద’ పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. గణేశయ్య చెప్పిన నవల నేపథ్యం, నవల నుంచి  చిన్న భాగం- శోభ పాఠకుల కోసం) నవల నేపథ్యం: ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఐశ్వర్యవంతవంతమైన సామ్రాజ్యాలలో ఒకటైన ‘విజయనగరం’ రెండవ రాజధానిగా పిలవబడే…

యుద్ధం ..!

కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో 27 మంది పర్యాటకులు  మరణించి పది  రోజులు గడిచింది. ఉగ్రవాదులు ఎవరు ..ఎక్కడి నుంచి వొచ్చారు ..స్థానికుల సహాయం తీసుకున్నారా అన్న అనుమానాల పై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర నిఘా వర్గాలు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. ముస్లిం మతోన్మాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండదండలు ఉన్నాయని ..ఉగ్రవాదులకు…

విశిష్టాద్వైత మతోద్ధారకుడు రామానుజుడు

రామాను జాచార్యుల జయంతి సందర్భంగా రాజాదరణ పొంది ప్రాబల్యాన్ని సంతరించుకున్న జైన, బౌద్ధ, శైవ మతాలు స్థానిక ఆచార వ్యవహారాలలో కలసి, అనేకానేక శాఖలుగా విభజితాలై, వేర్వేరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ తమ శాఖలు గొప్పవని నొక్కి చెబుతూ, మూల ఉపనిషత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయజాలని సమ యాన, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించి ఉద్దరించారు శ్రీ రామాను…

రాజకీయ సామాజిక మద్దతుతో సమగ్ర కుల గణన సాధ్యం

తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే కుల సామాజిక-ఆర్థిక డేటాను ఉపయోగించుకుని రిజర్వేషన్లపై 50% పరిమితిని సవరించాలని ఒత్తిడి చేశారు. జాతీయ స్థాయిలో ఇలాంటి సర్వేలను అమలు చేయడం ద్వారా మరింత ముందుకు సాగాలని అక్కడి నాయకులు కేంద్రాన్ని కోరారు.ఈ డేటా రాబోయే సంవత్సరాల్లో రిజర్వేషన్‌ ‌కోటాలు, సంక్షేమ పథకాలు, వనరుల కేటాయింపులను ప్రభావితం చేస్తుంది.…

విద్యా కమిషన్ సిఫార్సులు చెత్త బుట్ట కేనా!?

వాస్తవంగా ఈ పాఠశాలలకు కూడా ఒక్కో పాఠశాలకు 200కోట్లు చొప్పున 58 ఇంటిగ్రేటెడ్‌ ‌పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో కేటాయించిన 23వేలకోట్లు లో 18,400కోట్లు బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఖర్చు అవుతాయి. మిగిలిన 3వేల కోట్లతో రాష్ట్రం లోని 30,668 ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్లు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం…