కృష్ణా జలాల్లో వాటాకు ఏపీ డిమాండ్‌

‌- బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌తీర్పును సవాల్‌ ‌చేసిన ఏపీ
– విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు

న్యూదిల్లీ, జూలై 27: కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌తీర్పును సవాల్‌ ‌చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ధర్మాసనం కేసును పరిశీలించింది. సుదీర్ఘ విచారణ చేయాల్సి ఉన్నందున.. ఈ కేసును ప్రత్యేక బెంచ్‌ ‌ముందు విచారణకు నివేదిస్తామని వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్‌ ‌మొదటి వారానికి వాయిదా వేసింది.ఈలోగా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కృష్ణా నదీ జలాల వాటాలపై బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్‌ ‌తీర్పును కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పైనే ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *