హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ పాలకమండలి సభ్యులు ఆహ్వానించారు. సచివాలయంలో మంత్రిని సోమవారం కలిసిన పాలకమండలి ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 2న జరిగే బోనాల ఉత్సవం, 3న నిర్వహించే రంగం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఈవో మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రామతీర్థ శర్మ, వేణుమాధవ శర్మ వేద మంత్రోచ్చారణలతో మంత్రిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవీవరప్రసాద్, మంత్రి సోనాల్, మల్లికార్జున్, గంటా గీత, కిరణ్ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





