– మహేశ్వరం ఈ-సిటీ పార్కు సందర్శించిన సీఎస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : పారిశ్రామికాభివృద్ధి మరింత వేగం తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజjáYT జాజు అధికారులను ఆదేశించారు. మహేశ్వరం ఈ-సిటీలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్, అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమ, మంఖాల్ పారిశ్రామిక పార్కును, ఎం/ఎస్ చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ పరిశ్రమలను సంజయ్ జాజు సోమవారం సందర్శించారు. పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందించారు. ముందుగా మెసర్స్ ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సందర్శించారు. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారు చేస్తోన్న ఈ పరిశ్రమ లో ప్రస్తుతం 1,200మంది పనిచేస్తున్నారు. అనంతరం ఎం/ఎస్ అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమను సీ.ఎస్ సందర్శించారు. ఈ పరిశ్రమ హైటెక్ రక్షణ ఎలక్ట్రానిక్స్, శాటిలైట్ పేలోడ్ వ్యవస్థలు, గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రధానంగా చేపడుతోంది. రూ.59.22 కోట్ల పెట్టుబడి గల ఈ సంస్థలో 400మంది పనిచేస్తున్నారు. మంఖాల్ పారిశ్రామిక పార్కులో మెసర్స్ చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ పరిశ్ర మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందర్శించారు. ఈ యూనిట్ వాణిజ్య ఉత్పత్తి నిర్వహిస్తూ రూ.284.02 కోట్ల పెట్టుబడితో 500మందికి ఉపాధి కల్పిస్తోంది. అనంతరం మహేశ్వరం జనరల్ పార్కులోని మెసర్స్ విప్రో ఎంటర్‌ప్రైజెస్(ప్రై) లిమిటెడ్‌ను సందర్శించారు. ఈ యూనిట్ రూ.17,434 లక్షల పెట్టుబడితో వాణిజ్య ఉత్పత్తి నిర్వహిస్తూ 331 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఎం/ఎస్ మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సంజయ్ జాజు సందర్శించారు. ప్రస్తుతం ఈ యూనిట్ రూ.37,405 లక్షల పెట్టుబ డితో వాణిజ్య ఉత్పత్తి నిర్వహిస్తూ 2,782మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆయన వెంట టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక, సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ మోడల్ స్కూల్ సందర్శన 
మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను సీఎస్ సంజjáYT సంద ర్శించి విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌక ర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఆయన వారి విద్య, భవిష్యత్ లక్ష్యాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపు వంటి అంశాలపై విలువైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలý విద్యార్థులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొంటూ ప్రభుత్వం కల్పిస్తున్న విద్యావకాశాలు, సాంకేతిక వనరులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, వసతి గృహాలు, తాగునీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణ, ఇతర మౌలిక వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఉపాధ్యాయులు, అధికారులతో సమీక్షించిన ఆయన విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన వసతుల మంజూరుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల సమయాల్లో విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్సు సేవలను పాఠశాల వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటిన ప్రధాన కార్యదర్శి పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. శశాంక్, కృష్ణ ఆదిత్య జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




