అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం

ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు

గోదావరిఖని, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రామ గుండం నగరంలో త్వరలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రామగుండం (Godavarikhani) నగర పాలక సంస్థ ఆద్వర్యంలో మునిసిపల్ టి జంక్షన్ వద్ద మంగళవారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎఎస్ , ఐపిఎస్, గ్రూప్ వన్, టూ, త్రీ, ఫోర్ లాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి స్థానిక నిరుపేద అభ్యర్థులు వ్యయ ప్ర యాసల కోర్చి ఢిల్లీ, హైద్రాబాద్ లాంటి సుదూ ర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికుడైన సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అంబే ద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసి అన్ని వస తులు కల్పించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని అన్నారు. స్థానిక ఎంఎల్ఎ విజ్ఞప్తి మేరకు నాలెడ్జ్ సెంటర్ తో పాటు అనువైన స్థలాన్ని గుర్తించి అంబేద్కర్ కమ్యూనిటి హాల్ కూడా నిర్మిస్తామని ఇందుకు అవసరమైన నిధులు కూడా సమకూరుస్తామని అన్నారు. రామగుండం నగరంలో దళిత వాడలలో అభి వృద్ది పనులు చేపట్టడానికి ఈ రెండేళ్ల కా లంలో 14 కోట్ల రూపాయలు, సంక్షేమ కార్య క్రమాల్లో భాగంగా బ్యాంక్ లింకేజీ కింద మరో 14 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింద ని వెల్లడించారు. ఇంకా ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. పార్టీల కతీతంగా అర్హులoదరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. రామగుండం నగర ప్రజలు డైనమిక్ వైబ్రెంట్ అని అభివృద్ది, సంక్షేమానికి సంబందించి మంచి సూచనలు చేస్తే వాటిని ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళతామని అన్నారు. సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య తో పాటు పలువురు కార్పొరేటర్లు , రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఎసిపి ఎం. రమేష్, సిఐ ఇంద్రసేనా రెడ్డి, సింగరేణి ఆర్ జి వన్ జిఎం లలిత్ కుమార్ తో పాటు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కాoపెల్లి సతీష్ , మైస రాజేష్ , న్యాతరి రాయమల్లు , కొంకటి లతక్ష్మణ్ ,పోషం , వివిధ పార్టీల నాయకులు , మెప్మా ఆర్ పి లు , అంగన్ వాడీ కార్యకర్తలు , దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *