ఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోవాలి

– సీఎం రేవంత్‌కు బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఉన్న సమయంలో ప్రస్తుత బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. అందులోని అంశాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి 2023లో వీఆరఎస్ తీసుకునే వరకు సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా తన పదవీ కాలంలో ఆయన అనేక ఆర్థిక అవతవకలకు, పరిపాలనాపరమైన అక్రమాలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు బహిర్గతమయ్యాయి. ప్రధానంగా మా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను మీ ముందుంచుతున్నాను. ఐఐటీ/జేఈఈ కోచింగ్ పేరుతో దాదాపు రూ.20 కోట్ల దుర్వినియోగం. 2013 నుంచి 2021 వరకు గురుకుల విద్యాలయాలకు సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్ల మేరకు నిధుల దుర్వినియోగమయ్యాయి. టెండర్లు లేకుండా ఏకపక్షంగా నిధులను ఖర్చు చేసి ఆయన నిబంధనలు ఉల్లంఘించారు. గురుకులాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యురైజేషన్‌లోనూ పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారు. డైట్, యూనిఫామ్స్, షూస్, సాక్స్, బెడ్డింగ్, కాస్మెటిక్స్, స్టేషనరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌కు సంబంధించి నిబంధనలకు భిన్నంగా తన అనుయాయకులకే కట్టబెట్టారు. నాటి సీఎం కేసీఆర్ అండతోనే ప్రవీణ్ కుమార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఐఏఎస్ నిర్వహించాల్సిన విధులను ఐపీఎస్ అధికారి ఆరఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఏకంగా పదేళ్లపాటు అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ప్రవీణ్ కుమార్ ప్రైవేట్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసుకుని ప్రశ్నించిన వాళ్లపై దాడులకు ఉసిగొల్పినా పట్టించుకోలేదు. గురుకులాల్లో అవినీతి, నిధుల దుర్వినియోగంపై ‘కాగ’ వంటి స్వతంత్ర సంస్థలు నివేదిక ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వదం విచారణకు ఆదేశించలేదు. ప్రవీణ్ కుమార్ అవినీతిపై పీసీసీ ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఆరఎస్ అవినీతిపై విచారణ జరపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2014 నుండి 2023 వరకు గురుకులాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించండి బాధ్యుల నుండి ఆస్తులను స్వాధీనపర్చుకోవడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆ లేఖలో ముఖ్యమంత్రిని గువ్వల కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *