ధర్మం వైపు నిలబడితేనే విజయం

– బీజేపీ చీఫ్ విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు 

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచి మాత్రమే గెలుస్తుందనే నమ్మకాన్ని కలిగించే గొప్ప పండుగ దసరా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. కష్టాలను ఎదిరించి ధర్మం వైపు నిలబడినప్పుడే అసలైన విజయం దక్కుతుందని మన చరిత్ర, మన సంస్కృతి చెబుతున్నాయన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహాన్ని, ముందుకు సాగే ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. మన పల్లెలు, పట్టణాలు సుభిక్షంగా ఉండాలని.. అన్నదాతలకు మంచి పంటలు, యువతకు కొత్త అవకాశాలు, మహిళలకు రక్షణ, గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ కనకదుర్గమ్మను ప్రార్థించారు. సమాజంలో ద్వేషం పోయి ఐక్యత పెరగాలని, మనమంతా కలిసి తెలంగాణను, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఆశిస్తున్నానంటూ ప్ర‌జ‌ల‌కు విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *