బ్రిక్స్ ప్రతినిధులకు విందు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : హైదరాబాద్tలో బుధవారం నుంచి ప్రారంభమైన బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు, బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్-2026ల నేపథ్యంలో బ్రిక్స్ మంత్రులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తతదిరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల మంత్రులను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం సలహాదారు కె.రామకృష్ణా రావు, సీఎం ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్, డీజీపీ సీవీ ఆనంద్, కార్మిక శాఖ కార్యదర్శి హరిచందన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *