అభివృద్ధిలో కరీంనగర్ ను అగ్రభాగాన నిలుపుతాం

– ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత అభివృద్ధే మా లక్ష్యం
– బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం 
– నగరంలో రూ.1.5 కోట్లతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని రవాణా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మం త్రులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేష న్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా 46వ డివిజన్లో యూడీఐఎఫ్ నిధులు రూ.1.5 కోట్లతో చేపట్టనున్న బాక్స్  డ్రైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. భీమదేవరపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో ‘నవోదయ విద్యాలయాలు’, జమ్మికుంట, హుస్నాబాద్లో ‘కేంద్రీయ విద్యాలయాలు’ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదిం చినట్లు తెలిపారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం. ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తూనే, కరీంనగర్లో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి వైద్య రంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 నుంచి 90 శాతం పూర్తయి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ పుణ్యక్షేత్రాలతోపాటు ఎలగందుల ఖిల్లా, ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణాభివృద్ధికి 1,000 కొత్త పోస్టులకు క్యా బినెట్ ఆమోదం తెలిపిందని, కరీంనగర్లో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు అందించేందుకు జిల్లా ఇంచార్జి మం త్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక మంత్రుల తో చర్చిస్తున్నామని తెలిపారు. ప్రజల ఉమ్మడి సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే సానుకూలంగా స్పందించి పరిష్కరి స్తామని, జిల్లా అభివృద్ధిలో జర్నలిస్టులు కూ డా తమ అమూల్యమైన సూచనలతో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ కొలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మున్సి పల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *