– ఎస్ఐర్ ను రద్దు చేయాలని కేరళలో సీజేపీ భారీ నిరసన
– ప్రకాశ్ రాజ్ నేతృత్వంలో ప్రదర్శన
– సుమారు 500 మంది పాల్గొన్నట్లు నిర్వాహకుల వెల్లడి
– జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరాడుతాం: అభిజీత్
కొచ్చి/దిల్లీ , ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | నవంబర్ 7: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఉద్యమం శనివారం కేరళలోని కొచ్చికి విస్తరించింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జంతర్ మంతర్ ఎట్ కొచ్చి’ కార్యక్రమంలో నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. సుమారు 500 మంది కార్యకర్తలు పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ నుంచి రాజేంద్ర మైదాన్ వరకు జాతీయ పతాకాలతో నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్‌ఐ) కేరళ రాష్ట్ర అధ్యక్షురాలు చింతా జెరోమ్ కూడా పాల్గొన్నారు. ప్రదర్శన మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం మధ్యాహ్నం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేసే ఎన్నికల వ్యవస్థ ఏర్పడే వరకు జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ హయాంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం లేదని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు.కేరళలో తమ సంస్థకు యువత నుంచి గణనీయమైన మద్దతు ఉందని దీప్కే పేర్కొన్నారు. కొచ్చి కార్యక్రమానికి స్థానిక నిర్వాహకులు, ప్రకాశ్ రాజ్ ఆహ్వానం మేరకు వచ్చినట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





