– జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ
– మార్చి 1 నుంచి 5 వరకు రివిజినల్ రౌండ్
– జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్రంలో జనగణనకు జీవో ఎంఎస్ నెం.155ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ జరగనుంది. మార్చి 1 నుండి 5 వరకు రివిజినల్ రౌండ్‌ను నిర్వహిస్తారు. 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు ప్రామాణిక తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఎవరి ప్రమేయం లేకుండా స్వయంగా (సెల్ఫ్ ఎన్యూమరేషన్) తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. జనవరి 10 నుంచి 24 వరకు ప్రత్యేక యాప్, వెబ్సైట్ ద్వారా ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రంలో మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి విడతలో ఇళ్ల గణన విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా జనాభా లెక్కల సేకరణ కోసం సన్నాహక సమావేశాలతోపాటు సిబ్బంది నియామకం, శిక్షణ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది.ప్రజలు కేంద్ర ప్రభుత్వ అధికారిక స్వీయ గణన పోర్టల్ Census India Self-Enumeration Portal ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ పోర్టల్ ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
zతెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





