- పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ‘ గా నామకరణం
- *భూమిలేని రైతులకు కూడా వర్తింపు
- కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి మండలి నిర్ణయం
- జనవరి 26 నుంచి అమలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నాం.. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ . 12 వేలు రైతు భరోసా అందిస్తామని ..ఈ పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ‘ గా నామకరణం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం లో తెలియ జేసారు. శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను మీడియా కు వివరిస్తూ వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరా తో పాటు భూమి లేని వ్యవసాయ రైతులకు కూడా ప్రతి సంవత్సరం రూ. 12 వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
వ్యవసాయ యోగ్యం కానీ భూములకు ఈ పథకం వర్తించదని తెలిపారు . రేషన్ కార్డు లేని వారికి కూడా రేషన్ కార్డులు జారీ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు . వ్యవసాయ యోగ్యమైన భూములకు ప్రతి ఎకరాకు అలాగే భూమి లేని వ్యవసాయ రైతులకు కూడా రూ. 12 వేలు ఇచ్చే కార్యక్రమం రాజ్యాంగం అమలులోకి వొచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా జనవరి 26 నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు . వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు) రైతు భరోసా వర్తించదాని తెలుపుతూ ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే మా ప్రభుత్వం విధానం అని తెలిపారు.





