పింఛన్‌ ‌కోసం వృద్ధుల పరేషాన్‌..

నాటి ప్రభుత్వంలో ఠంఛన్‌గా వొచ్చేది..
కాంగ్రెస్‌ ‌హయాంలో 20 దాటినా రాని పరిస్థితి
ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌పాలనలో వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా ఔషధాలు, నిత్యావసరాలు పింఛన్‌ ‌డబ్బులతో తెచ్చుకునేవారని, కానీ కాంగ్రెస్‌ ‌పాలనలో అది సాధ్యం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఏలుబడిలో వృద్ధులు పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. . నెలానెలా సరైన సమయంలో పింఛన్లు ఇవ్వకపోవడంతో వృద్ధులు,  దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో నిత్యం ఎక్కడో చోట పింఛన్ల కోసం రోడ్డెక్కుతున్న ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో పింఛన్‌ ‌వృద్ధులు రోడ్డెక్కి వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌ ‌సీఎంగా ఉన్న సమయంలో నెలనెలా సక్రమంగా పింఛన్‌ ‌వొచ్చేదని.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధి కారంలోకి వొచ్చాక  పింఛన్‌ ‌డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వొస్తుందని వాపోయారు. 18 నుంచి 20వ తేదీలోగా పోస్టాఫీసుల్లో ఇచ్చేవారని.. నవంబర్‌ 25‌వ తేదీ వొచ్చినా ఇంకా డబ్బులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండురోజుల్లోనే వొచ్చేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వృద్ధులు శాంతించారు.

తెలంగాణాలో పింఛన్ల కోసం కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరూ అనుకోలేదని అన్నారు. మూసీ బ్యూటిఫికేషన్‌ ‌కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి.. కనికరం లేకుండా వృద్ధుల పెన్షన్‌ ‌డబ్బులను ఆపుతారని అనుకున్నారన్నారు. అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు..? మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు? అంటూ ‘ఎక్స్’ (‌ట్విట్టర్‌)‌లో పోస్ట్ ‌పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *