ఆ ఒక్క వాక్యానికే శిక్ష -చందలూరి నారాయణరావు

ఆమె కోర్టులో నా వాక్యం బోనులో ప్రవేశపెట్టబడింది క్షమించలేని ఇష్టం శిక్షింపదగ్గ నమ్మకం లిఖింపలేని భావం దండించదగ్గ లోతు సాక్ష్యాలుగా బలమైన నా మనసుపై తీవ్ర వాదోపవాదనలు జరిగాక… అనివార్య పరిస్థితిలో ఆ ఒక్క వాక్యానికి మౌనమనే మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది.








