ఎక్కడో ఉండరు శత్రువులు
ఇంటిలోనే ఉండొచ్చు
మల్లెలు అనుకోకు
మహిషాసుర మర్ధినిలు!
పద్మాలు అనుకోకు
పాసుపతాస్త్రాలు!
పార్వతులే అనుకుంటే
పక్కన బల్లేలు
గంగలు నిజమే
సరాసరి వచ్చి తలమీదనే
తచ్చాడుతారు!
ఇజాన్ని పట్టుకొని
నిజానికి నీళ్ళుపోసి బతికిస్తారు
అయినా ఫరవాలేదు
మనలో గిరీశాలు ఉండనే ఉన్నారు
సీరియళ్లలో చిందులేసి
బతకనివ్వండి.
పీరియడ్ల పాపాన
ఇంటావలే ఉండనివ్వండి
ఇరుగు పొరుగు
అమ్మలక్కలతో
ఇసుమంత జాగ్రత్త సుమండీ
బోడెడ్డుకు పోట్లు మప్పుతారు
బోలెడంత జాగ్రత్త
వంటింట్లో ఎపుడైనా
ఆదమరచి అడిగేయకండీ
పద్మవ్యూహంలో పడి
తిరిగిరాని రాకుమారుడివి కాకపోవు
మోహ రుతువులే అనుకోకు
నేహా బోరాలు కావొచ్చు
కాక్రోచ్చులు అనుకోకు
కక్కుల కొడవళ్ళు
చీపుర్లు తిరగబడ్డాక
చేసింది ఏమీలేదు!
ఆడతనం చివురించిన కొమ్మకు
నువ్వొక కాయవై
కాసావని మర్చిపోకు





