Day September 3, 2026

ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల విజయోత్సవం

– సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో వెలుగులు – వర్షంలోనూ ఉత్సాహంగా కొనసాగిన భారీ ర్యాలీ – సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన మంత్రి సీతక్క ఏటూరునాగారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ…

ప్రజలకు సీఎం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకమని అన్నారు. శ్రీకృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకుని, ఆయన బోధనలను ఆచరిస్తే జీవితంలో ప్రతి పనిలో విజయాన్ని సాధించవచ్చని అన్నారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని…

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం సచివాలయానికి పాద‌యాత్ర‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు సచివాలయానికి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని ఆయనను అరెస్టు చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది లక్షల మందికిపైగా విద్యార్థుల నుంచి…

అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం కండి

– అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి – సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలను త్వరగా అందించేందుకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్…

జయగిరి విద్యార్థులకు రోటరీ క్లబ్ చేయూత

Rotary Club of Hanumkonda

8 డిజిటల్ టీవీలు, 200 బ్యాగుల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి సహకారం కొనసాగిస్తాం: వంగ రాజిరెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర సెప్టెంబర్, 3 : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలను అందించి, వారి విద్యాభివృద్ధికి చేయూతనందించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ (Rotary Club of Hanumkonda) ఆధ్వర్యంలో గురువారం హసన్‌పర్తి…

ఎస్ఆర్ హైస్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

భీమారం ఎస్సార్ హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు Sri Krishnashtami celebrations

హన్మకొండ, ప్రజాతంత్ర సెప్టెంబర్ 3: భీమారం ఎస్సార్ హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు (Sri Krishnashtami celebrations ) గురువారం ఘనంగా జ‌రిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సంద‌డి చేయ‌గా పాఠశాల ప్రాంగణం బృందావనాన్ని తలపించింది. చిన్నారులు ఉత్సాహంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నారులు కృష్ణులు,…

భీమ్‌రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్ కేసు

– బీనామీల పేర్లతో 20కి పైగా చర, స్థిరాస్తులు – ఆధారాలు సేకరిస్తున్న అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. అక్రమ ఆస్తులను కూడబెట్టిన కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు గత నెల…

అణు శక్తిగా మారకుండా ఇరాన్‌ను నిరోధిస్తాం

– ఇరాన్‌కు సాయం చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తాం – ఇరాన్‌తో వాణిజ్యంపై భారత్‌కు అమెరికా హెచ్చరిక – మోదీ, ఇరాన్ అధ్యక్షుడు భేటీ నేపథ్యంలో వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : ఇరాన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతోందన్న వార్తలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్‌కు…

వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం

– రెండు గంటలపాటు బురద నీటిలోనే న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న వరదల్లో 91 ఏళ్ల వృద్ధురాలి పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మెడ వరకు బురదలో కూరుకుపోయి, జేసీబీ స్కూప్‌లో కూర్చుని ఉన్న గుణ మాయ బోహరా చిత్రం ఈ విపత్తులో ఆశకు, మొక్కవోని సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. నువాకోట్‌లోని…