– అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి
– సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలను త్వరగా అందించేందుకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమేశాల ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌరవ సభ్యులు ప్రస్తావించే అంశాలపై సంబంధిత శాఖలు తగిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని, ప్రతి శాఖ తరఫున అసెంబ్లీలో ఒక నోడల్ అధికారిని నియమించి ప్రశ్నలకు సమాధానాల తయారీ, సమాచార సేకరణ, సమన్వయం తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు, విభాగాధిపతులు అవసరమైన సమాచారంతో ముందస్తుగా సిద్ధంగా ఉండాలన్నారు. శాసనసభలో ఏదైనా ప్రశ్నకు సంబంధించి అదనపు సమాచారం అవసరమైన సందర్భంలో వెంటనే సంబంధిత శాఖల నుంచి వివరాలను సేకరించి నిర్ణీత సమయంలో సమాధానం అందించే విధంగా సమన్వయ వ్యవస్థను పటిష్టం చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రశ్నోత్తరాలకు సంబంధించిన సమాచారాన్ని అసెంబ్లీ అధికారులకు వెంటనే అందజేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, బీఎండి ఎక్కా, వాణి ప్రసాద్, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, యోగితా రాణా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





