ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల విజయోత్సవం

– సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో వెలుగులు
– వర్షంలోనూ ఉత్సాహంగా కొనసాగిన భారీ ర్యాలీ
– సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన మంత్రి సీతక్క
ఏటూరునాగారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గురువారం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేలా భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేదలు, కార్మికులు, ఆదివాసీలు, గిరిజనులు సహా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు వివరించారు. ర్యాలీ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం కురిసినప్పటికీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంత్రితో కలిసి కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. వెయ్యి రోజుల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల కష్టాలను పరిష్కరిస్తూ ప్రతి వర్గానికి అండగా నిలిచేలా ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు, రైతులకు అందిస్తున్న సహాయం, పేద కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన చర్యలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకొస్తున్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అంటే కేవలం పాలన చేసే ప్రభుత్వం కాదని, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం కోసం పనిచేసే ప్రభుత్వమని మంత్రి సీతక్క అన్నారు. మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. వెయ్యి రోజుల ప్రయాణం ప్రజల ఆశీర్వాదాలతో విజయవంతంగా సాగిందని పేర్కొన్న మంత్రి సీతక్క రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. వర్షంలోనూ భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేసిన ప్రజలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయని, ప్రజల సహకారంతో మరింత మెరుగైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సీతక్క
ఏటూరునాగారంలో దుస్తుల తయారీ, జూట్ బ్యాగుల తయారీ యూనిట్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. 1,219 మందికి నూతన రేషన్ కార్డులు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. మహిళల ఉపాధి కోసం ఆధునిక యంత్రాలతో శిక్షణ కేంద్రాలకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని, స్థానిక అటవీ ఉత్పత్తులతో గ్రామాల్లోనే ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచుకోవాలని అన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నారు. ఇప్పపువ్వు, తేనె, విస్తరాకులతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలన్నారు. శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామన్నారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *