Day September 1, 2026

బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక, నియంతృత్వ పాలన సాగిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండలో దాడికి గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యేలు మరియు ఇతర సీనియర్ నాయకులను హౌజ్ అరెస్ట్…

యాదాద్రి పవర్ స్టేషన్‌కు నైనీ బొగ్గు తొలి రేక్

దామరచర్ల, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్‌) విద్యుత్ ఉత్పత్తి దిశగా ఒక కీలక మైలురాయిని అధిగమించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) ఆధ్వర్యంలో నడుస్తున్న ఒడిశాలోని నైనీ గని నుండి సేకరించిన అత్యంత నాణ్యమైన 4,000 టన్నుల బొగ్గుతో కూడిన మొదటి రైల్వే రేక్ మంగళవారం ప్లాంట్‌కు చేరుకుంది.…

విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి పరిహారం

– అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1 : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందజేసింది. ట్రాన్స్‌కో హుజూరాబాద్ 132/11 సబ్ స్టేషన్ పరిధిలో గ్రేడ్-2 ఉద్యోగిగా పనిచేస్తున్న శంకర్ రెడ్డి గతంలో విద్యుత్ షార్ట్…

కొత్తగూడెం విమానాశ్రయంపై కీలక ముందడుగు

–  7న రానున్న కేంద్ర సాంకేతిక బృందం న్యూదిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈనెల‌ 7న  పర్యటించనుంది. దిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి…

‘శుద్ధీకరణ’ పేరిట దళిత ఆత్మగౌరవంపై దాడి

– ఉత్తరాఖండ్ ఘటనపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం కోట్లాది దళితుల ఆత్మగౌరవంపై జరిగిన ఘోర దాడి అని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ…

నర్సు శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండ

– బాధిత కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ కొత్తగూడెం, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: తుక్కుగూడలో దారుణ హత్యాచారానికి గురైన నర్సు ఉకే శిరీష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి…

‘ఫీజు’ బకాయిలు తక్షణం విడుదల చేయాలి

– మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1 : ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత…

కాంగ్రెస్ దాడి సంస్కృతిపై ‘సడక్ సే సదన్ తక్’ పోరు

– రాచందర్ రావుతో బీజేపీ నితిన్ నబీన్ ఫోన్ సంభాషణ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1 : తెలంగాణలో బీజేపీ నేతలు, కార్యాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ నబీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుకు ఫోన్ చేసి…

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ప్రజా వంచనే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్ర ధ్వజం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకున్న వెయ్యి రోజుల పాలన ప్రజా పాలన కాదని, అది ముమ్మాటికీ ప్రజా వంచన పాలన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం…