యాదాద్రి పవర్ స్టేషన్‌కు నైనీ బొగ్గు తొలి రేక్

దామరచర్ల, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్‌) విద్యుత్ ఉత్పత్తి దిశగా ఒక కీలక మైలురాయిని అధిగమించింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) ఆధ్వర్యంలో నడుస్తున్న ఒడిశాలోని నైనీ గని నుండి సేకరించిన అత్యంత నాణ్యమైన 4,000 టన్నుల బొగ్గుతో కూడిన మొదటి రైల్వే రేక్ మంగళవారం ప్లాంట్‌కు చేరుకుంది. ఈ తొలి బొగ్గు రేక్‌కు టీజీజెన్‌కో డైరెక్టర్లు బి.నాగ్య (బొగ్గు & లాజిస్టిక్స్),  వై.రాజశేఖర్ రెడ్డి (థర్మల్ & ప్రాజెక్ట్స్) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ నుండి సుమారు 1,050 కిలోమీటర్ల దూరం రవాణా అయిన ఈ అధిక నాణ్యత గల బొగ్గు వల్ల బాయిలర్ల పనితీరు మెరుగవడమే కాక బూడిద సమస్యలు తగ్గి ప్లాంట్ గరిష్ట సామర్థ్యంతో పనిచేసేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక చొరవతో టీజీజెన్‌కో, సింగరేణి, రైల్వేల సమన్వయంతో ఈ సుదూర రవాణా ప్రక్రియ సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరగడం వల్ల రాష్ట్రానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *