– రాచందర్ రావుతో బీజేపీ నితిన్ నబీన్ ఫోన్ సంభాషణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : తెలంగాణలో బీజేపీ నేతలు, కార్యాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగడుతున్నందుకే ఓర్వలేక పార్టీపై దాడులకు తెగబడుతున్నారని రామచందర్ రావు వివరించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడుల వివరాలను నబీన్‌కు తెలియజేశారు. బాధితుడు వర్షిత్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్తుంటే తనను హౌజ్ అరెస్ట్ చేసి అనంతరం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన తీరును వివరించారు. ఘటనల వివరాలు తెలుసుకున్న నితిన్ నబీన్రా ష్ట్రంలో బీజేపీ శ్రేణుల ధైర్యాన్ని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న రాష్ట్ర నాయకత్వానికి, కార్యకర్తలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ దాడులకు భయపడేది లేదని, ‘సడక్ సే సదన్ తక్’ (రోడ్డు నుండి అసెంబ్లీ వరకు) పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, దాడికి గురైన నాగం వర్షిత్ రెడ్డితో కూడా నబీన్ త్వరలోనే ఫోన్ ద్వారా మాట్లాడి పరామర్శించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





