– అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందజేసింది. ట్రాన్స్‌కో హుజూరాబాద్ 132/11 సబ్ స్టేషన్ పరిధిలో గ్రేడ్-2 ఉద్యోగిగా పనిచేస్తున్న శంకర్ రెడ్డి గతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతిచెందగా ఆయన సతీమణి బోడ స్వాతికి మంగళవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా రూ.1 కోటి ప్రమాద బీమా చెక్కును అందించారు. ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడిన డిప్యూటీ సీఎం వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లభించిన బీమా సొమ్ముతో పిల్లలకు నాణ్యమైన విద్యనందించి మంచి భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత
రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. మొదట సింగరేణి సంస్థలో ప్రారంభమైన రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థలకు విస్తరించి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయే ఉద్యోగుల కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆర్థిక భరోసానిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఇతర ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





