మైనింగ్ సమస్యలపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : మైనింగ్ సమస్యలపై సెక్రటేరియట్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చింది. రోడ్డు పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు మైనింగ్ శాఖ 10రెట్ల పెనాల్టీలు వేయడం సరైంది కాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన అధికారిపై చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖ మంత్రి వివేక్‌ను మంత్రి కోమటి రెడ్డి కోరారు. రూ.5 కోట్లకు రూ.54 కోట్లు పెనాల్టీ వేయడం దుర్మార్గమని అన్నారు. కాంట్రాక్టర్లు అగ్రిమెంట్‌లోనే చెల్లింపులు చేస్తారని, అక్రమ మైనింగ్ చేసేవారిని వదిలిపెట్టి అమాయక చిన్న కాంట్రాక్టర్లపై దౌర్జన్యంగా వ్యవహరించడం సరైనది కాదని కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అద్దంలాంటి, ఆదర్శ వంతమైన రోడ్లు వేయాలని హ్యామ్ మోడల్‌లో రోడ్లు ప్రారంభించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హ్యామ్ రోడ్ల నిర్మాణం ఎంతో అట్టహాసంగా ప్రారంభించుకున్నామని చెప్పారు. 2028 ఆగస్టు నాటికి రోడ్లు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఇసుక, మట్టి, మెటల్ వంటివి ఇప్పుడు అత్యంత అవసరం కనుక మైనింగ్ శాఖ మెటల్ పర్మిషన్‌పై కాంట్రాక్టర్లను ఇబ్బందిపెట్టొద్దు అని కోరారు. మంత్రి కోమటిరెడ్డి లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా స్పందించి మైనింగ్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి, టీజీఎండీసీ అనుదీప్ దురిశెట్టి, ఆర్ అండ్ బి సీఈ బి.వి.రావు(హ్యామ్ రోడ్లు), మైనింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *