నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారతీయ విద్యావ్యవస్థ పునాదులను బలహీన పరిచింది. 2026 నూతన ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్దతుల నిరోధక) సవరణ బిల్లు కూలిపోతున్న భవనానికి సున్నం పూసిందంతే.
పరీక్షాపత్రాల లీకేజికి సంబంధించి కొత్త బిల్లు

1947లో భారతదేశం విభజనకు లోనైనపుడు తన విద్యావ్యవస్థను బ్రిటిష్ నుండి అరువు తెచ్చుకొన్నారు. బ్రిటిష్ కింద బానిసత్వంలో మగ్గుతున్నపుడు, భారతదేశానికి ఎటూ ఏ గత్యంతరమూ లేదు. ఇదే కారణంతోటి మన పూర్వీకులు బ్రిటీష్ కు వ్యతిరేకంగా లేచి నిలబడ్డారు. ఎన్నో త్యాగాలు, వందల వేల హత్యలు, రక్తపాతం తరువాత బ్రిటీష్ పాలన మన దేశం నుండి వైదొలిగింది. స్వాతంత్ర్యం తరువాత, మెల్లిమెల్లిగా తన దేశంలో తన వేను గట్టిపర్చుకొన్నది విద్యావ్యవస్థ. ఈ వ్యవస్థకు పాదులు తొవ్వి, నీళ్లు పోసి పెంచిన మన తాత ముత్తాతలు ఇప్పుడీ ప్రపంచంలో లేరు.
అయినా వారి గొంతుకలు చరిత్రలో మార్మోగాయి. వాళ్ల మాటలే మన గొంతుల్లో ప్రతిధ్వనిస్తాయి. అలాంటి ఒక గొంతుక మౌలానా ఆజాద్ గారిది. 1953, సెప్టెంబర్ 30న, ఆల్ ఇండియా రేడియోలో ఆయన చేసిన ప్రసంగంలో “అందరూ చెబుతున్నట్లే మన విద్యావ్యవస్థలో ఖచ్చితంగా ఏదో లోపం ఉన్నది. అందరికీ కనిపించే లోపం ఏమిటంటే, సామాన్యప్రజలకు చేరువవుతున్న చదువు సరిపోవటం లేదు, వారి అవసరాలను తీర్చటం లేదు. ఉన్నత విద్య వరకూ వెళ్ల గలిగిన వారికి కూడా ఉద్యోగాలు దొరకటం లేదు.”
ఈ దుస్థితిని ప్రభుత్వం మారుస్తుందనీ, విద్యావ్యవస్థను బలహీనపడనివ్వదనీ మౌలానా ఆజాద్ అన్నారు. తరువాత ప్రతిధ్వనించిన గొంతుక గొప్ప విద్యా తత్వవేత్త డా. భీమారావు అంబేద్కర్ గారిది. “పరీక్షల సారాంశం విద్యా సారాంశానికి పూర్తి భిన్నమైంది. విద్యస్థాయిని పెంచే పేరుతో మనం మన పరీక్షలను మృతప్రాయం చేస్తున్నాము. అదీ ఎంతగానంటే చరిత్ర కూడా యూనివర్శిటీల గడపలకు దూరంగా ఉంచిన వెనుకబడిన వర్గాల విద్యార్థులు విద్యా దరిదాపులకు కూడా రాలేనంతగా.”
వీరిద్దరూ కలిసి వారికి చేతనైనంతగా భారతీయ విద్యా వ్యవస్థకు ఎనలేని కృషి చేశారు. మౌలానా బడులను తెరిచి, కాలేజీలనూ కొత్త యూనివర్శిటీలనూ నిర్మించి, చదువును ముందుకు తీసుకొని వెళ్లే సంస్థలన్నిటినీ స్థాపించారు. చరిత్ర వారికి ఋణపడి ఉంటుంది. వారి బాధ్యతలకంటే ముందుకు వెళ్లి దేశప్రజలకూ కొత్త దేశానికీ కావాల్సిన ఈ విద్యాసంస్థలను దేశప్రజలకు అందించారు. వాళ్లు ఆత్మద్రోహం చేసుకోలేదు. ఆత్మసాక్షికి రాజీ పడలేదు. చదువు, సాంకేతిక పురోగమించాయి. ఇప్పుడున్నది ఇంటర్నెట్ యుగం. ఆల్ ఇండియా రేడియోలో మౌలానాగారి ప్రసంగం ప్రసారం అయిన 73 సంవత్సరాల తరువాత, ఏదో జరిగింది.
అర్ధరాత్రి సవాలు
అర్ధరాత్రి, దేశప్రధాని నరేంద్రమోదీ తన ముఖాన్ని చూపిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. దేశంలో అతి పిన్న వయస్కులైన యువతారాన్ని సంబోధించదల్చి ఆయన “మిత్రులారా” అన్నారు. ఆ పిల్లలు ఆయనకు 4 కిలోమీటర్ల దూరంలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఈ యువతరం విద్యావ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం వుందంటోంది. NEET పరీక్షలో జరిగిన లీకేజి వలన విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడుతున్నారని అంటోంది. ఈ పరిస్థితికి విద్యాశాఖా మంత్రి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని అంటోంది. దానికి సమాధానంగా రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ అహంకారపూరితంగా ఇదీ బీజేపీ ప్రభుత్వం అనీ, ఇది యూపీయే కాదనీ అన్నాడు. బీజేపీ ప్రభుత్వంలో రాజీనామాలు జరగవని అన్నాడు.

నైతిక విలువలను పక్కనబెట్టేసి, ధర్మేంద్ర చాలరోజుల వరకు రాజీనామా చేయలేదు. విద్యార్థులు ధర్మేంద్ర నుండి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూనే వున్నారు. రోజులు గడిచేకొద్దీ ఆగ్రహం, అసహనపు స్థాయిలు వేడెక్కాయి. శాంతియుతంగా పార్లమెంటు వద్దకు ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల మీద దిల్లీ పోలీసు లాఠీలను కురిపించారు, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
అసలే ఏడుస్తున్న వాళ్లను ఇంకా ఏడవమనే ప్రత్యక్ష అర్థం వచ్చేటట్లు జరిగిందిది.
మహిళా ఆందోళనకారుల ప్రైవేట్ అవయవాల మీద లాఠీలతో దాడి చేస్తున్న మగ పోలీసు అధికారుల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వందలాది విద్యార్థులు గాయపడ్డారు, హాస్పిటల్స్ పాలయ్యారు, చాలామందిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్ధుల మీద పెల్లెట్ గన్స్ ని కూడా ఉపయోగించారు. ఇంకోవైపు బీజేపీ పోలీసులు విద్యార్థుల మీద ఏకే 47 బుల్లెట్లు పేలుస్తున్నారని బీహార్ ఆందోళనల నుండి వార్తలు వస్తున్నాయి.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశపు విద్యార్థులను విపరీతంగా కష్టపెట్టింది. హోమ్ శాఖామంత్రి అమిత్ షా పోలీసులను విద్యార్థుల మీద పురిగొల్పాడు. ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి . విద్యార్థులు డిమాండ్స్ చెబుతూనే ఉన్నారు. ఇంకొకవైపు గెరిల్లాల తరహాలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన పార్టీ నాయకులతో ప్రధానమంత్రి నివాసానికి వెళ్లి ధర్నాకు కూర్చోన్నాడు.
మూడు డిమాండ్స్ తో వాళ్లు అక్కడకు వెళ్లారు.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
- విద్యార్థుల మీద దాడి చేసిన పోలీసు అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి
- పార్లమెంటులో విద్యావ్యవస్థ మీద చర్చ జరగాలి
నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో రైతుల ఉద్యమం తరువాత ఇదే అతిపెద్ద ఉద్యమం. రాహుల్ గాంధినీ, ప్రియాంకా గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ గాంధీ ముక్కు నుండి రక్తం కారటాన్ని ప్రపంచమంతా చూసింది. దేశంలో ఆగ్రహం అంతకంతకూ పెరగటం చూసి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. రాజ్ నాథ్ సింగ్ ప్రకటన తన చెప్పుతో తానే కొట్టుకొన్నట్లుగా మారింది. జంతర్ మంతర్ వద్ద నిరసన ఆగింది. విద్యార్థుల మీద పోలీసుల ఆగడాల గురించి చర్చలు మొదలైయ్యాయి. రాబోయే తరం భవిష్యత్తుకు సంబంధించిన చదువు గురించి దేశ పార్లమెంట్ చర్చలు చేస్తోంది. నరేంద్ర మోదీ ఈ చర్చలో కనబడలేదు. హోమ్ మంత్రి గాయబ్. విద్యార్థుల మీద ఎందుకు బలప్రయోగం చేశారని హోమ్ మంత్రిని ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ప్రతిపక్ష పార్టీలు అడుగుతూనే ఉన్నారు.
విద్య మీద చర్చ జరిగితే, ప్రధానమంత్రి హాజరైతే, ఎంపీలు అతని డిగ్రీ గురించి అడుగుతారని అతని భయం కావచ్చు. ఆ పెల్లెట్లను విద్యార్థుల శరీరం మీద ప్రయోగిస్తున్నారనే సంగతి హోమ్ మంత్రి అమిత్ షా కు తెలియకుండా అయినా ఉండాలి, లేకపోతే అతనే ప్రయోగించమని ఆదేశాలు ఇచ్చి ఉండాలని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నాడు. ఎలా జరిగినా అమిత్ షా కూడా రాజీనామా చేయాలి.
బిల్లు
ఇదంతా జరుగుతుండగానే పార్లమెంటు 2026, ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్దతుల నిరోధ) సవరణ బిల్లుని ప్రవేశపెట్టింది. అది బుధవారం పాస్ అయింది. అంటే 2026 జూలై 29న. అందరూ అనుకొనేది ఏమిటంటే ఈ బిల్లు పేపర్ లీకులను అడ్డుకొనే కఠిన చట్టమని. ప్రజాస్వామిక పునాదులను బలపర్చటానికి ఈ చట్టాన్ని నిశితంగా పరిశీలించాలి. ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ చట్టం పరీక్షా పత్రాల లీకులను నిషేధించడానికి రాలేదు, భవిష్యత్తులో జరిగే లీకులకు శిక్ష పెంచాలని మాత్రమే చెబుతోందని అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో లీకై వెలుగులోకి వచ్చిన ప్రశ్నాపత్రాల సంఖ్య 152.
ఈ బిల్లు అలాంటి పేపర్ లీకేజీలను అరికట్టగలదా? కాలమే చెప్పాలి. కానీ ఇలాంటి బిల్లునే బీజేపీ ప్రభుత్వం 2024లో పాస్ చేసింది. ఆ బిల్లులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించే నిబంధనలు ఉన్నాయి. అవును, కాకపోతే అప్పటి బిల్లులో ఒక రూపాయి జరిమానా స్థానంలో ఇప్పుడు పది పైసల జరిమానా ఉన్నట్లుగా -ఇప్పటి బిల్లుతో పోలిస్తే శిక్ష తీవ్రత తక్కువగా ఉండేది. నేరం రుజువైతే ఇప్పటి ఐదు నుంచి పదే జైలు శిక్షకు బదులుగా అప్పట్లో మూడు నుంచి ఐదే జైలు శిక్ష ఉండేది.
ఇదంతా చూస్తుంటే ప్రధానమంత్రిగారికి పేపర్ లీకేజ్ వాలాలతో మొదటి నుండి ఏదో ఒప్పందం జరిగినట్లు అనిపిస్తుంది పరీక్షాపత్రాల లీకేజీల మీద నిరసనలు జరిగినపుడు, అతను ఇంకో కమిటీని వేస్తాడు, లేకపోతే ఇంకో చట్టాన్ని తెస్తాడు. చిరునవ్వులు చిందిస్తూ, కాషాయపు తలపాగాలు ధరించి తప్పించుకు తిరుగుతున్న ఈ మోసగాళ్ళతో ఆయన కుమ్మక్కైనట్లే కనిపిస్తోంది.
మొదటి దోపిడీదారు: నీట్ పరీక్ష
ఈ దేశంలో నీట్ పరీక్ష లెక్కలేనంతమంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నది. ఈ పరీక్ష మొదటి బాధితురాలు తమిళనాడుకు చెందిన ఎస్. అనిత. ఆ విద్యార్థిని మరణం ఉపాధ్యాయులనూ, తల్లిదండ్రులనూ, దేశవ్యాప్తంగా విద్యార్ధులను కదిలించివేసింది. ఎస్ అనిత నీట్ పరీక్షకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేసింది. 12వ తరగతి పరీక్షలో 1200లకు గాను 1176 మార్కులు (98%) వచ్చినా, ఆమెకు మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. 2017 సెప్టెంబర్ 1న, ఆమె బలవన్మరణం పొందింది. అనిత తమిళనాడు అరియలూర్ జిల్లాలోని ఒక కుగ్రామంలో జీవించేది. ఆమె తండ్రి రోజువారీ కూలి. ఆమె మరణం తరువాత నీట్ పరీక్షకు వ్యతిరేకంగా రాజకీయ, సామాజిక నిరసనలు ఒక మలుపు తీసుకొన్నాయి.

నీట్ బాధితురాలిగా అనిత మొదటిదే కావచ్చు, కానీ చివరది కాదు. ఆమె తరువాత, ఒకరి తరువాత ఒకరు చెప్పలేనంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంవత్సరం కూడా నీట్ పేపరు లీక్ అయింది. 22మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోక పోవటమే కాదు, ప్రభుత్వమే పరీక్షా పత్రాలను లీక్ చేసేవాతో కుమ్మక్కు అయిందన్న ఆరోపణలను ఎదుర్కొన్నది. ఇది నిజం కాకపోయినా, నరేంద్ర మోదీ ప్రధాన ముఖంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ మాఫియాలను పట్టుకోవడంలో విఫలమైందనే మాట మాత్రం కాదనలేనిది.
నీట్ పరీక్షను అర్థం చేసుకోవటానికి జస్టిస్ ఏకే రాజన్ నాయకత్వంలో ఒక పై స్థాయి కమిటీని తమిళనాడు ప్రభుత్వం 2021లో వేసింది. ప్రొఫెసర్ ఎల్. జవహర్ నేసం ఆ కమిటీ సభ్యుడు. అతను రెండు ముఖ్యమైన విషయాలను బయటకు తీశాడు. “నీట్ నేర్చుకోవటం కంటే ‘కోచింగ్’ కే పెద్ద పీట వేస్తుంది. ఇలా చేయటం అంటే చదువుకున్న అసలు సారాన్ని నాశనం చేయటమే.”
ఆయనన్న రెండోమాట, ఈ పరీక్ష భారతదేశపు బహుముఖ తత్వాన్ని తొక్కి పడేస్తుందని. నీట్ పరీక్ష నిర్వహించదల్చుకొని నిర్వహించగలిగిన రాష్ట్రాలు నిర్వహించుకోవచ్చు, వద్దనుకొనే రాష్ట్రాలు తమ సొంత పరీక్షలను తమ సొంత వ్యవస్థల ద్వారా నిర్వహించుకోవచ్చునని అనేక కమిటీలు సూచించాయి. కానీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కీలకమైన వైద్యవిద్యా రంగం మీద నీట్ ఆధారిత పరీక్షా విధానాన్ని దేశమంతా రుద్దింది. దానికర్థం నీట్ అనే ఒక విపత్తుని దాటితేనే డాక్టర్ కావాలనే కల నెరవేరదు.
2019 జాతీయ మెడికల్ కమిషన్ చట్టం ప్రకారం, విద్యార్ధులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యవిద్యను అందించే విద్యావ్యవస్థ ఉండాలి. డాక్టర్లు, ఇతర వైద్య నిపుణులకు నైపుణ్యం ఉండాలి, కావసినంత మంది ఉండాలి. ఆరోగ్యసేవలు భారత ప్రజలకు అందరికీ సమానంగా అందాలి. వైద్యవిద్యలో పరిశోధనలు అత్యుత్తమ ప్రమాణాలతో జరగాలి. ఆ పరిశోధనలు ఎంతో జాగ్రత్తగా, ఆటంకాలు లేకుండా జాతీయ లక్ష్యాల వైపు పురోగమించాలి. సరికొత్త ఆవిష్కరణలకు చోటు ఇస్తూ పారదర్శకతతో జరగాలి అవి. వైద్యసంస్థల మీద క్రమం తప్పక తనిఖీలు జరగాలి. రిజిస్టర్ ను నిర్వహించాలి. నీట్ పరీక్షను ప్రోత్సహించే వ్యవస్థలో, ఏమున్నా ఏమి లేకపోయినా ఒక రిజిస్టర్ మాత్రం నిర్వహించబడుతుందని ప్రొఫెసర్ నేసమ్ వ్యంగ్యంగా అన్నారు.మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 92వ స్టాండింగ్ కమిటీ నివేదిక ద్వారా పరీక్షల వ్యయాన్ని విద్యార్థులు సొంతంగా భరించనవసరం లేదని పార్లమెంటు చెప్పింది. దానికి భిన్నంగా నీట్ పరీక్ష కయ్యే ఖర్చు దేశ విద్యా బడ్జెట్ తో సమానంగా ఉంటోంది. అంటే ఈ దేశపు విద్యావ్యవస్థను నడిపించే భారం నీట్ పరీక్షకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల మీద పడుతోంది. ఇప్పుడొచ్చిన కొత్త బిల్లు నీట్ పరీక్షను నిషేధించే మాట మాత్రం చెప్పటం లేదు.
రెండో దోపిడీదారు: కోచింగ్ సెంటర్లు
అల్లెన్, బైజు, ఇంకా యూపీఎస్ సీ, ఇతర ప్రభుత్వ పరీక్షల కోసం ఉండే కోచింగ్ కేంద్రాల సామ్రాజ్యాల గురించి ఈ బిల్లు మాట్లాడలేదు. ఈ సెంటర్లు ఇప్పటికే అనేక క్రూర నేరాలు చేశాయి. పాటియాలా పంజాబీ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కులదీప్ సింగ్ మాటల్లో చెప్పాలంటే, “ఈ నేరాలు పైకి కనబడవు. కానీ దేశపు మేధో సామర్ధ్యం మీద దెబ్బ కొడతాయి.” “ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కోచింగ్ కేంద్రాలు భారీగా డబ్బులు తీసుకొని దేశాన్ని ఎందుకూ పనికిరాని వాళ్లతో నింపేస్తాయి,” అని కూడా అన్నారు. భారత రాజధానిలో, ఇంకా ఎక్కడెక్కడో ఉండే కోచింగ్ సెంటర్ లలో వరదలు వచ్చి, మంటలు అంటుకొని ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులను మనం చూసాము. వాటిమీద ఏ చర్యలూ తీసుకోలేదు.అయితే ఏ యూనివర్సిటీని కూల్చివేశారు. మౌలానా జవహర్ యూనివర్సిటీని. ఎందుకు? దాని పేరులో మౌలానా ఉండటం వలనా? ఈ దేశపు మొదటి విద్యామంత్రి పేరులో కూడా మౌలానా ఉందని ఈ దేశపు నాయకులు మర్చిపోకూడదు. డిజిటాల్ విద్య విస్తరించే ధోరణి పెరిగాక, ఈ కోచింగు సెంటర్లు, ఈ సామ్రాజ్యాలు కోట్లాది డబ్బుని జేబులో వేసుకొన్నాయి. ఈ డబ్బుకు లెక్కాపక్కా లేదు. ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్దతుల నిరోధక) సవరణ బిల్లు ఈ విషయంలో నోరు విప్పడం లేదు.
మూడో దోపిడీదారు: ఎన్ టీ ఏ (జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ)
ఎన్ టి ఏ అంటే ఏమిటి? దీన్ని మూడు దశలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు దశల గురించి చాలా కఠినంగా వుందని చెప్పే కొత్త బిల్లు మాట్లాడలేదు. మొదటిగా ఏ కమిటీ పరీక్షా పత్రాలను తయారు చేస్తుంది? ఏ నిపుణులు వాటికి తుది రూపం ఇస్తారు? ఏ పరీక్షకు ఏ నిపుణులు ఉంటారు? ఇలాంటి వాటిని వేటినీ ఈ బిల్లు నిర్ణయించలేదు.
అమ్మమ్మ వాళ్లింటికి ఐసు డబ్బాతో వచ్చి ఐస్ ఫ్రూట్ అమ్మే వ్యక్తి లాంటి ప్రైవేటు అమ్మకందారులు ప్రశ్నలను నిర్ణయిస్తారా? ఇది మొదటి దశ. ఇక్కడ లీకేజి జరగలేదనుకొందాము. ఐస్ ఫ్రూట్ వాలా నిజాయితీపరుడు. రెండో దశలో ఎవరు పరీక్షా పేపర్ ను పరీక్షా కేంద్రానికి రవాణా చేస్తారనేది. ఇక్కడే మాల్ ప్రాక్టీస్ జరిగిందనే గట్టి సాక్ష్యాలు ఉన్నాయి. మనం మొబైల్ ఫోన్ కొన్నా, ఒక్కోసారి వాళ్లు ఇటుకను తెస్తారు. మనం దేశం ఇక్కడ ఎలా నిర్లక్ష్యంగా వుంది? విద్యార్థుల భవిష్యత్తు ఇటుక కన్నా అధ్వాన్నమా?మూడో దశ పరీక్షా కేంద్రమే. అక్కడ పిల్లల చెవి కమ్మలు కూడా తీసేస్తారు. అక్కడెలా పేపర్ లీక్ అవుతుంది?
నాల్గవ దోపిడీదారు: ఆన్ లైన్ పరీక్షలు
ఆన్ లైన్ పరీక్షల గురించి మాట్లాడుకొంటే, ఎవరు కాంట్రాక్టర్లో ఎవరికీ తెలియని వారికి కమ్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం అప్పగిస్తోంది. ఇక్కడ కొత్త తరహా మోసం జరుగుతోంది. ఒక ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో డబ్బు చెల్లించటం ఎంతో పటిష్టంగా జరుగుతుంది. అయినా దొంగలు అందులోకి చొరబడి డబ్బులు దొంగిలించి తప్పించుకొంటారు. వాళ్ల గుర్తింపు కూడా దొరకదు. మరి విద్యార్థి పేపర్ లీక్ అవటం పెద్ద విషయమా?
“ప్రతి విద్యార్థికీ ఒక ఎన్ క్రిప్ట్ అయిన కోడ్ ఇస్తాము. అలా ఇచ్చాక మోసం జరగదు. కాబట్టి ఈ మాట తప్పు,” అంటున్నారు. మొదటి విషయం అలా చేయనవసరం లేదు. రెండు, ఇంతకుముందు రాష్ట్రాలు తమ పరీక్షలను తామే నిర్వహించుకొనేటపుడు, ఈ స్థాయిలో ఎప్పుడూ లీకులు జరగలేదని అంటారు ప్రొఫెసర్ నేసమ్. ఈ నలుగురు దోపిడీదారులు భారతీయ విద్యా వ్యవస్థను గుండాయిజంగా మార్చేశారు. కాబట్టి ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంటులోకి వచ్చినా, ఇంతకంటే తాతలాంటి బిల్లు వచ్చినా ఫలితం మాత్రం శూన్యం.
ఈ దశల మధ్య ఒక అంధకార రాత్రి వస్తుందా? ఆ చీకటి రేయిలో మత్తెక్కించే చాక్లెట్టుని తిని కుక్కలు మొరగకుండా పడుకొంటే, శబ్దం లేకుండా పేపర్ లీక్ అవుతుందా? అప్పుడు కూడా ఈ పేపర్ లీకుగాళ్లు జీవితాల మీద దాడి చేస్తారు. బుల్లెట్లు కురిపిస్తారు. తుపాకులు కాలుస్తారు. జనాలను జైళ్లలో వేస్తారు. అప్పుడు ప్రభుత్వం పేపర్ లీకు చేసి బయటకు పంపిన వేదికను నిషేధిస్తామని చెబుతుంది. కానీ అందరూ కోరుకొనేది ఎన్ టీ ఏ ని నిషేధించమని . దానికి బదులుగా ప్రభుత్వం టెలిగ్రామ్ ను నిషేధించింది . డా. అంబేద్కర్, మౌలానా ఆజాద్ లు కలలు కన్న భారతీయ విద్యావ్యవస్థను నిర్మించటానికి అడుగు వేసే ముందు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి.
“చరిత్ర వారికి ఋణపడి ఉంటుంది. వారి బాధ్యతలకంటే ముందుకు వెళ్లి దేశప్రజలకూ కొత్త దేశానికీ కావాల్సిన ఈ విద్యాసంస్థలను దేశప్రజలకు అందించారు. వాళ్లు ఆత్మద్రోహం చేసుకోలేదు. ఆత్మసాక్షికి రాజీ పడలేదు. చదువు, సాంకేతిక పురోగమించాయి..”





