హై-స్పీడ్ రాజకీయ నాటకాలు

ఊహించినట్లే శుక్రవారం లోక్ సభలో  కేంద్రం ప్రవేశపెట్టిన  131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ లో వీగిపోయింది. సభలో మెజార్టీ లేకపోయిన బీజేపీ, ఎన్డీయే పక్కా వ్యూహంతో సవరణ బిల్లులు తీసుకొచ్చింది . మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏప్రిల్‌ 16న మూడు బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఓడిపోతామని తెలిసి కూడా ఇండి కూటమి, కాంగ్రెస్‌ లక్ష్యంగా  ప్రధాన మంత్రి  మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ వేసారు. .కేంద్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు,డీలిమిటేషన్‌ బిల్లును తీసుకువొచ్చింది. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. . ఎన్డీయే సర్కార్ ప్రవేశపెట్టిన  మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఈ బిల్లులు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి..
ఈ బిల్లులు రాజ్యాంగ సవరణతో ముడిపిడి ఉండటంతో ఇవి గట్టెక్కవని  మోదీ కి తెలుసు.. కానీ వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇండి కూటమిని టార్గెట్‌ చేసేందుకు ప్రచారాయుధంగా మార్చుకోవొచ్చని బీజేపీ ప్లాన్‌ …. బిల్లు అమోదం పొందినా , వీగిపోయినా  అది బీజేపీకి లాభం చేస్తుందన్న వ్యూహంతో బిల్లులు  తీసుకోచ్చింది. .రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే మహిళల హక్కుల కోసం బీజేపీ కృషి చేసిందని చెప్పుకోవొచ్చు. వీగిపోతే మహిళలకు రాజకీయ హక్కులు కల్పించడం ప్రతిపక్షాల ఇష్టం లేదని, విపక్షాలకు  మహిళలు  రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం ఇష్టం లేదని ప్రచారం చేయోచ్చన్నది  వ్యూహంలో భాగం వాస్తవం అన్నది బిల్లు వీగిపోయిన 15 నిమిషాలకే బీజేపీ మహిళా ప్రతినిధులు పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శించిన నిరసన స్పష్టం చేస్తున్నది.
 ..పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల కోసం జరిగిన రాజ్యాంగ సవరణ బిల్లు చర్చ మరియు వోటింగ్ సందర్భంగా జరిగిన నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి . నాసా శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచేలా, అధికార పక్షానికి చెందిన ‘అపర చాణక్యులు’ కాల ప్రయాణం (టైమ్ ట్రావెల్ ) లో ఆరితేరినట్లు కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు (నిజానికి ఇది మహిళా కోటా ముసుగులో వొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన ప్లాన్) ఎప్పుడైతే వీగిపోయిందో, అధికార పార్టీ ఒక ఇంద్రజాలం చేసింది. రాత్రి 7:45 గంటలకు సభ తలుపులు మూతపడగా, సరిగ్గా 8:00 గంటలకల్లా వారి మహిళా ఎంపీలు బయట నిలబడి తళతళలాడే హై-డెఫినిషన్ ప్లకార్డులు ప్రదర్శించారు . మహిళా హక్కులపై ప్రభుత్వ చిత్తశుద్ధి నత్తనడకన సాగొచ్చు కానీ, వారి ‘ఎక్స్‌ప్రెస్ డెలివరీ’ ప్రింటర్ మాత్రం రాకెట్ వేగంతో పనిచేసింది ! కేవలం 15 నిమిషాల్లోనే వారు సరికొత్త “యాంటీ-ఉమెన్” (మహిళా వ్యతిరేక) బ్రాండింగ్ క్యాంపెయిన్‌ను డిజైన్ చేసి, ప్రింట్ చేసి, నిరసనలు తెలిపారు . ఇది ‘బేటీ బచావో’కి హై-స్పీడ్ సీక్వెల్‌లా ఉంది.
ఈ పార్టీ ప్రింటర్‌కు నాసా కూడా కనుగొనలేని ఏదో టర్బో-బూస్ట్ సెట్టింగ్ ఉన్నట్లుంది. దేశంలో హైస్పీడ్ రైలు ఆలస్యమవుతుండొచ్చు కానీ, హై-స్పీడ్ రాజకీయ నాటకాలు మాత్రం అదిరిపోయే ట్రాక్‌లో ఉన్నాయి. విమర్శకులు దీన్ని  ముందే రాసుకున్న స్క్రిప్ట్‌గా భావిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర కేవలం ప్లాన్ మాత్రమే కాదు, భవిష్యత్తును చూసే ‘మాయా దర్పణం’ కూడా ఉన్నట్లుంది. విపక్షాలు బిల్లులో దాగి ఉన్న “పునర్విభజన ఉచ్చు” గురించి చర్చిస్తుంటే, అధికార పార్టీ అప్పటికే ప్రింటింగ్ షాపులో ఉన్నట్లుంది. డెడ్ లాక్ సృష్టించడం, వెంటనే ఆ “ఇన్‌స్టంట్” బోర్డులతో  విపక్షాలకు “మహిళా వ్యతిరేకులు” అనే ముద్ర వేసి 8 గంటల వార్తల్లో చూపించడమే వారి స్పష్టమైన లక్ష్యం.
   . “సుప్రీం లీడర్” హెచ్చరికలు ఉన్నప్పటికీ, విపక్షాలు వెనక్కి తగ్గలేదు. తాము మహిళా కోటాకు మద్దతు ఇస్తున్నామని, అయితే 2027 జనాభా లెక్కలతో ముడిపెట్టిన ఈ దొడ్డి దారి ఆలోచనకు  మాత్రమే వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. *విపక్షాలు ఈ వింతను నిలదీసాయి : మూడేళ్లుగా 2023 బిల్లుపై “ఫార్వర్డ్” బటన్ నొక్కలేని ప్రభుత్వం, కేవలం పదిహేను నిమిషాల్లో నిరసన కోసం “హై-స్పీడ్ ప్రింట్” బటన్‌ను ఎలా కనుగొందో అని ఎద్దేవా చేశాయి. ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్ర అద్భుతం! ఒకవైపు చట్టాలు చేయడంలో వెనుకడుగు వేస్తూ, మరోవైపు సుప్రీం లీడర్ మహిళా సాధికారత కథలో విపక్షాలను విలన్లుగా చూపించడానికి నిమిషాల్లో రోడ్డు మీద ప్రదర్శనలను సృష్టిం చేసారు.
చివరికి, ఇరుపక్షాలు తామే గెలిచామని చెప్పుకుంటున్నాయి. బీజేపీ విపక్షాలను “మహిళా వ్యతిరేకులు”గా ముద్ర వేయడంలో బిజీగా ఉంటే, విపక్షాలు మాత్రం మోదీ ప్రభుత్వానికి లోక్‌సభలో తొలి ఓటమిని రుచి చూపించామని సంబరపడుతున్నాయి. కానీ గందరగోళం తగ్గాక ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది: ఒక పార్టీ పదిహేను నిమిషాల్లో ప్రొఫెషనల్ ప్లకార్డులను తయారు చేయగలిగినప్పుడు, మహిళా హక్కుల కోసం తపన పడటానికి వారికి మూడేళ్లు ఎందుకు పట్టింది? ప్రస్తుతం మన దేశంలో ‘వందే భారత్’ వేగంతో నడుస్తున్నది కేవలం ‘ప్రచార యంత్రం’ (Propaganda machine) మాత్రమే అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *