– మంత్రి శ్రీధర్ బాబు
మంథని, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : ఈనెల 20న కాటారం మండలం నస్తూరిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే రెండో విడత రైతు భరోసా సభను జయప్రదం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథనిలో విలేకరులతో మాట్లాడుతూ సభలో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇతర మంత్రులు పాల్గొంటారని, ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించి సభను జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోనే రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకం అమలు చేశామని అన్నారు. బహిరంగ సభకు మంథని నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ శ్రేణులు, రైతులను పెద్ద ఎత్తున తరలించాలని మంథని, రామగిరి, కమాన్ పూర్, ముత్తారం, పాలకుర్తి మండలాల అధ్యక్షులకు మంత్రి సూచించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే ఈ బహిరంగ సభలో వేసవికాలం దృష్ట్యా తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, పలు మండలాల అధ్యక్షులు అయిలీ ప్రసాద్, దొడ్డ బాలాజీ, సయ్యద్ అన్వర్, రొడ్డ బాపు, మంథని ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కమాన్ పూర్ ఎఎంసి చైర్మన్ వైనాల రాజు, మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశి భూషణ్ కాచే, పలు మండలాల యూత్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్, రెబల్ రాజ్ కుమార్, సాదుల శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





