- వర్ష ప్రభావిత జిల్లా కలెక్టర్లకు రు.5 కోట్ల తక్షణ సహాయం
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచిస్తూ సోమవారం ఉదయం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు కింది సూచనలు చేసారు.
1. కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి..
2.కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలి..
3.భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో ని 8 పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలి.
4.వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం.
5.ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలి…
6.వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలి…
7.వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలి…
తక్షణమే కేంద్ర సాయం కోరుతు లేఖ ..
జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు…వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతు ప్రధాని నరేంద్ర మోదీ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసారు.
ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు సమీక్షలో తెలిపారు.





