బతుకమ్మ సంబురాలు షురూ..

ఊరూరా ఉత్సాహంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు
నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం
ముస్తాబైన అమ్మ‌వారి ఆల‌యాలు

నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2:  ‌తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయమే సందడి మొదలయ్యింది. ఊరూవాడా బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ‌గ వేడుక‌లు బుధ‌వారం  ప్రారంభమ‌య్యాయి. గురువారం నుంచి 9 రోజుల పాటు 9 నైవేద్యాలతో ఈ బతుకమ్మ సందడి నెలకొంటుంది. 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు.

మొక్కజన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు.

కానీ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ నాడు మాత్రం నైవేద్యాన్ని మహిళలే తయారుచేస్తారు. 1. ఎంగిలి పూల బతుకమ్మ, 2. అటుకుల బతుకమ్మ, 3. ముద్దపప్పు బతుకమ్మ, 4. నానే బియ్యం బతుకమ్మ, 5. అట్ల బతుకమ్మ, 6. అలిగిన బతుకమ్మ, 7. వేపకాయల బతుకమ్మ, 8. వెన్నముద్దల బతుకమ్మ, 9. సద్దుల బతుకమ్మ, తొమ్మిది రోజులపాటు బతుకమ్మను పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *