తెలంగాణలో రైతు రుణ మాఫీ

హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోస్ట్‌
న్యూ దిల్లీ, జూలై 31 : తెలంగాణలో మరో ఎన్నికల హావిూని నెరవేర్చామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ స్పందిస్తూ… తెలంగాణలో రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌లో ‘తెలంగాణలో రైతులకు మళ్లీ శుభాకాంక్షలు. మన ఎన్నికల హావిూ ప్రకారం..

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ రెండవ విడతను విడుదల చేసింది. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం.. రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు రూ. 1.5 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేసి వారిని ఆదుకుంది. ఒక వైపు బీజేపీ దేశవ్యాప్తంగా రైతులను అప్పుల ఊబిలో కూరుకునేలా చేయడమే కాకుండా ఎంఎస్‌పీకి చట్టబద్దత కూడా కల్పించడం లేదు. అందుకు భిన్నంగా కాంగ్రెస్‌ ప్రతి సందర్భంలోనూ రైతు కుటుంబాలకు సహాయం అందించడానికి కృషి చేస్తుంది. ఇండియా కూటమి భారత దేశ రైతులకు ఎంఎస్‌పి పైన చట్టపరమైన హావిూ ఇచ్చి, రుణ విముక్తులను చేస్తుందని ఎక్స్‌లో  రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *