హైదరాబాద్‌ను రక్షించుకుందాం

  • జీఓ 111 రద్దును ఉపసంహరించుకునే వరకూ పోరాడుదాం
  • తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌జీఓ  111ను రద్దు చేసేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రను అడ్డుకోవాలని అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రకటన విడుదల చేసింది.  కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధి చెంది కుతుబ్‌ ‌షాహీ పాలనలో విస్తరించి అసప్‌ ‌జాహీ నవాబుల పాలనలో ఆధునికమైన హైదరాబాద్‌ అం‌తర్జాతీయ ప్రఖ్యాతి పొందిందనీ, అన్ని జాతుల ప్రజలకు వందల ఏళ్లుగా ఆలవాలమైందని పేర్కొన్నారు. మూసా, ఈసా పేర్లుతో పారుతున్న రెండు నదుల అలల మధ్య అలరారుతున్న జీవగడ్డ జీఓ 111 రద్దుతో నేడు నిర్జీవగడ్డగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నగర ప్రజలకు కానీ, పర్యావరణ వేత్తలకు కానీ, పట్టణంలోని ఐటీ కంపెనీలకు కానీ సంప్రదించకుండా ఏ రకమైన వివరణ ఇవ్వకుండాప్రభుత్వం పట్టణం తలాపున ఏడు కోట్ల ఘనపుటడుగుల జీవజలాలలను మాయం చేసే కుట్రలను ప్రజలు తిప్పికొట్టడానికి సమయాత్తం కావాలని పిలుపునిచ్చారు. జీఓ 111 రద్దుపై ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈనెల 19న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశాన్ని ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయంవతం చేయాలని ఈ సందర్భంగా  తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రతినిధులుపిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *