జర్నలిస్టులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

–  మీడియా అకాడమి చైర్మన్ .శ్రీనివాసరెడ్డి  

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : జర్నలిస్టులు కూడా ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో కృత్రిమ మేధలో టూల్స్ అండ్ టెక్నిక్స్ వర్క్‌షాప్‌ను మీడియా అకాడమీ, డాటా లీడ్స్, గూగుల్ న్యూస్ ఇనిషివేటివ్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానల్స్‌కు చెందిన తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలకు సంబంధించిన జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు కూడా వృత్తిలో భాగంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఏఐని జర్నలిస్టులు ఉపయోగించుకొని రిపోర్టింగ్‌లో సులభతరమైన పద్ధతులను పాటించి తక్కువ సమయంలోనే ఎక్కువ అంశాలను పాఠకులకు, వీక్షకులకు అందించవచ్చునని అన్నారు. రిసోర్స్ పర్సన్ ఉడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు కూడా నిత్య విద్యార్థిలాగా ఉండాలన్నారు. అదేవిధంగా తాను కూడా నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగానే కొనసాగుతున్నానని చెప్పారు. శిక్షణలో భాగంగా ఏఐ టూల్స్ ఉపయోగాలు, ప్రమాదాలు, ఏఐ పద్ధతులు, నియమ నిబంధనలు, ప్రాథమిక అంశాల గురించి  వివరించారు. కృత్రిమ మేధ జర్నలిస్టుల వృత్తిలో భాగంగా తప్పనిసరి అయిందన్నారు. చాట్ జీపీ¾టి, పెర్పెక్లిసిటీ, నోట్ బుక్ ఎలఎం, గూగుల్, జమినై, మిడ్ జర్నీ, సోరా, విఇఓ3, తదితర టూల్స్ ని పరిచయం చేసి జర్నలిస్టులు ఎలా ఉపయోగించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఉదాహరణల ద్వారా అవగాహన కలిగించారు. ఏఐ డాటా ట్రైయినింగ్‌లో వినియోగంలో లోపం వల్ల, ప్రామ్టింగ్ ఇంజనీరింగ్ సరిగా చేయకపోవడం వల్ల వివక్ష లేదా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *