అదుపుతప్పి మూసీలోకి దూసుకెళ్లిన బస్సు

– స్కూల్ పిల్లలకు తప్పిన ముప్పు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ బస్సు అదుపుతప్పి మూసీ నదిలోకి దూసుకెళ్లిన సంఘటన సోమవారం జరిగింది. దీంతో బస్సులోని చిన్నారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్కూల్ బస్సు రోడ్డుపై నుంచి అదుపుతప్పి మూసీ నదిలోకి దూసుకెళ్లడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *