సిసిఐ అమ్ముతుంటే రాష్ట్ర బిజెపి ఏం చేస్త్తుంది

  • ఆ డబ్బును తెలంగాణ అభివృద్దికి వినియోగిస్తారా
  • కాళేశ్వరానికి సాయం చేస్తారా లేక కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ పెడతారా
  • బిజెపికి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు కవిత పలు ప్రశ్నలు సంధిస్తూ దమ్ముంటే ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని ఆమె సవాల్‌ ‌చేశారు. ఛత్తీస్‌గడ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌కర్ణాటక, ఆదిలాబాద్‌లో ఉన్న సిమెంట్‌ ‌ఫ్యాక్టరీలను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది. అయితే తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్‌ ‌ఫ్యాక్టరీలు అమ్మగా వొచ్చే డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అని కవిత ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వొచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారో చెప్పే చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు ఉందా? అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా? కాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను, ఆదిలాబాద్‌ ‌సిమెంట్‌ ‌ఫ్యాక్టరీతో పాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా వి•రు ఏం సాధించాలని అనుకుంటున్నారని కవిత నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ ‌చేశారు. ఆదిలాబాద్‌ ‌సిమెంట్‌ ‌ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి ప్రధాని మోదీని కేసీఆర్‌ ‌స్వయంగా కలిసి చర్చించారని కవిత తెలిపారు. కేటీఆర్‌ ‌కూడా అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వొచ్చినా కూడా సిమెంట్‌ ‌ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టడం వెనక ఉన్న అర్థం ఏమిటని అడిగారు. కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డ ఫ్యాక్టరీని మూసివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీని అడుగడుగునా ప్రశ్నించాలని కవిత ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page