– టీఐఐ ఛాలెంజ్-2026 టోర్నమెంట్లో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ అసోసియేషన్(బీఏటీ) ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్(టీఐఐ) ఛాలెంజ్-2026 టోర్నమెంట్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఏటీ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ వేదికలపై దేశ, రాష్ట్ర కీర్తి పతాకాన్ని రెపరెపలాడించే క్రీడాకారులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





