బేతుపల్లి చెరువులో గల్లంతైనవారు క్షేమం

– రాత్రంతా జాగారమే: ఒడ్డుకు చేరిన 11 మంది
– వెరీ గుడ్ కలెక్టర్ దివాకర్ అని ప్రశంసలు
– సీఎం రేవంత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కితాబు
– క్షేత్రస్థాయిలో మంత్రి తుమ్మల, పొంగులేటి పర్యటన

ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 5 : ఉద్వేగ క్షణాలు.. ఉత్కంఠ భరిత ఘటన అనంతరం గురువారం ఉదయం సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. ముందు రాత్రంతా అక్కడ జాగరమే అయింది. ఏకంగా రెస్క్యూ అపరేషన్ కు వెళ్లిన 11 మంది గల్లంతుతో బేతుపల్లి చెరువు వార్తలకు ఎక్కింది. వారంతా క్షేమంగా రావడంతో జిల్లా యంత్రాంగం చూపిన అప్రమత్తత, సమన్వయం, బాధ్యతాయుతమైన పనితీరును ప్రశంసలందుకుంది.

ప్రతి క్షణం ఉత్కంఠే.. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద బుధవారం సాయంత్రం ఎనిమిది మంది జాలర్లు చెరువుకు వలలు కట్టేందుకు వెళ్లగా.. వరద ప్రవాహానికి అక్కడే చిక్కుకు పోయారు. స్థాని కుల సమాచారంతో భద్రాచలంలో ఉన్న10 మందితో కూడిన ఎస్ డి  ఆర్ఎఫ్(స్టేట్ ఫోర్స్) బృందం రంగంలోకి దిగింది. రక్షించే చర్యల్లో భాగంగా ముందుగా బోట్లలో వెళ్లిన సిబ్బంది ముగ్గురిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొ చ్చారు. మరో ఐదుగురి కోసం ఎస్ డి  ఆర్ఎఫ్ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి రెండు బోట్లలో చీకట్లోనే జాలర్లు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి రెండు బోట్లూ ఒకదానికొ కటి ఢీకొని నీటిలోనే బోల్తాపడ్డాయి. దీంతో పది మంది ఎస్ డి  ఆర్ఎఫ్ సిబ్బంది, ఒకరు స్థానికులు మొత్తం 11 మంది వరద ప్రవా హానికి చెల్లా చెదురయ్యారు. వరద ప్రవాహంలో చిక్కి చెల్లాచె దురైన ఎస్ డి  ఆర్ఎఫ్ సిబ్బందిని రక్షించేందుకు విజయవాడ  నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు (సెంట్రల్ ఫోర్స్) అక్కడికి వెళ్లాయి. అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో బెటాలియన్ కు  చెందిన మంచాల వేణు ఆచూకీ లభించగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొదట అతన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం గురువారం తెల్లవారు జామున 5 గంటల నుంచి 7.30 గంటల  ప్రాంతంలో మిగతా వారిని గాలించి ఒడ్డుకు చేర్చడంతో వరద నీటిలో చిక్కుకున్నవారంతా  సేఫ్  గా బయట పడ్డారు.

వెరీ గుడ్ కలెక్టర్.. మంత్రి తుమ్మల ప్రశంస

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని గుండెనిండుగా ప్రశంసించారు. ‘వెరీగుడ్ కలెక్టర్’ అంటూ అభినందించారు. పోలీసులు సహా మొత్తం 16మంది ప్రాణాలను వరద నీటి నుంచి రక్షించడంలో అధికార యంత్రాంగం సమర్ధవంతతను ప్రదర్శించినట్లు తుమ్మల కీర్తించారు. ఆపద సమయంలో జిల్లా యంత్రాంగం చూపిన అప్రమత్తత, సమన్వయం, బాధ్యతాయుతమైన పనితీరును ప్రశంసించారు. అదేవిధంగా ఎస్ డి  ఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా మంత్రి తుమ్మల స్థానిక సత్తుపల్లి ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ లో ఘనంగా సన్మానించారు. ప్రాణాలను కాపాడడంలో ఆయా విభాగాల సిబ్బంది పోరాట ప్రతిమ అమోఘమని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామని తుమ్మల పేర్కొన్నారు. ‘చిమ్మ చీకట్లో ధైర్యంగా 16 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన మీకు ఈ  ప్రభుత్వం తరఫున, జిల్లా ప్రజల తరఫున నా ధన్యవాదాలని* మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిన్న రాత్రి నుంచి పర్యవేక్షించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు తుమ్మల తన అభినందనలు తెలిపారు. ఈ సంఘటనలో చుట్టుపక్క గ్రామాల ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి, పార్టీ యంత్రాంగానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కూడా కితాబిచ్చారు. కలెక్టర్ ను ప్రశంసించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్న వారిని అభినందించారు.
——————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *