Take a fresh look at your lifestyle.

వేములవాడలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

  • పాల్గొన్న శివపార్వతులు, హిజ్రాలు
  • భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు, ప్రజాప్రతినిధులు

సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 30 : రాష్ట్రంలో అత్యంత పెద్ద శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై స్థానాచార్య అప్పాల భీమాశంకర్‌ ‌శర్మ అధ్వర్యంలోని వేదపండితులు శ్రీసీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించగా లక్షకుపైగా భక్తులు, 50 వేలకు పైగా శివపార్వతులు, 3 వేలకు పైగా హిజ్రాలు ఈ కల్యాణాన్ని వీక్షించారు. వేములవాడ మున్సిపాలిటి తరపున వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌చెన్నమనేని రమేశ్‌, ‌చైర్‌పర్సన్‌ ‌రామతీర్ధపు మాధవి, కౌన్సిలర్లు, దేవస్థానం తరపున ఈఓ కృష్ణ ప్రసాద్‌ ‌దంపతులు, జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, టిఆర్‌ఎస్‌ ‌నాయకుడు ఏనుగు మనోహర్‌ ‌రెడ్డిలు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు  సమర్పించారు.

కల్యాణంలో  సిరిసిల్ల సీనియర్‌ ‌సివిల్‌ ‌జడ్జి శ్రీలేఖతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి, సిఐ వెంకటేశ్‌ అధ్వర్యలో వందలాది పోలీసులు బందోబస్తును నిర్వహించారు. సాయంత్రం నుండి రాత్రి 8 గంటల వరకు సాగిన రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా వేములవాడలోకి అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. కల్యాణం సందర్భంగా వందలాది మందికి దేవస్థానం తరపున భోజనాలను సమకూర్చగా వివిధ స్వచ్ఛంద సంస్థలు మజ్జిగపాకెట్లు, నీటి పాకెట్లు, పాలను పంపిణి చేశారు.

Leave a Reply