– వివిధ టెండర్లలో పారదర్శకతకు 5 కమిటీలు
– హిమోఫిలియా బాధితులకు ప్రభుత్వం అండ
– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ(టీజీఎంసీడీసీ) అధికారులను ఆదేశించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశ మందిరంలో టీజీఎంసీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎంఎస్‌ల పనితీరుపై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, సర్జికల్స్, రీజెంట్స్, పరికరాల టెండర్లT పారదర్శకంగా ఉండేలా విధివిధానాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెండర్లలో పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న రెండు కమిటీలకు అదనంగా మÖడు కమిటీలను కొత్తగా ఏర్పాటు చేసి మొత్తం ఐదు కమిటీలను నియమించాలని మంత్రి ఆదేశించారు. సంస్థలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ఎండీ వీణ గౌరవ్ ఉప్పల్‌ను ఆదేశించారు. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) హాస్పిటల్స్‌లో టీజీఎంసీడీసీ ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, పరికరాలు, సివిల్ వర్క్స్‌ను పర్యవేక్షించడానికి తక్షణమే నోడల్ ఆఫీసర్స్‌ను నియమించాలని మంత్రి ఆదేశించారు. టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, పరికరాలు, సర్జికల్, రీజెంట్స్‌ను నెలవారీగా విధిగా సమీక్షించుకోవాలని కూడా మంత్రి దామోదర్ అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల హాస్పిటల్స్‌క£” అవసరమైన పరికరాలకు సంబంధించి ఒక ప్రామాణిక జాబితాను తయారు చేసి నిర్వహించాలన్నారు. దీని వల్ల అన్ని స్థాయిల హాస్పిటల్స్‌లో ఏకరూపత ఉంటుందన్నారు. మందుల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ‘క్యూర’ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న రెండు సీఎంఎస్ కేంద్రాలకు అదనంగా మరో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, హిమోఫిలియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. హిమోఫిలియా బాధితులకు నెల వారీగా అవసరమైన మందులను ఉచితంగా అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మందులను జనరల్ హాస్పిటల్స్ ద్వారా బాధితులకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. హిమోఫిలియా రోగులకు ఉపయోగించే మందులు ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, నీనిలోఫర్ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నట్లు మంత్రికి కార్పొరేషన్ అధికారులు వివరించారు. అదనంగా ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కార్పొరేషన్ అధికారులు, ఇన్‌చార్జి ఈడీ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





