– కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరపాలని మూసీ జన ఆందోళన్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : మూసీ పునరుజ్జీవనంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ కి తాము సమర్పించిన నివేదికకు ప్రతిస్పందనగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పంపిన సమాధానాన్ని తిరస్కరిస్తున్నట్టు మూసీ జనాందోళన్ వెల్లడించింది. 2026 ఏప్రిల్ 14న ఎంజేఏ సమర్పించిన విజ్ఞాపన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కి ఉద్దేశించబడింది. ఈ సబ్ కమిటీ మూసీ ప్రాజెక్టును సామాజిక, పర్యావరణ, ఆర్థిక, చట్టపర, మానవతా కోణాల నుంచి పరిశీలించాల్సి ఉంది. అటువంటి సందర్భంలో ప్రాజెక్టును అమలు చేస్తున్న సంస్థ అయిన ఎంఆర్డీసీఎల్, కేబినెట్ సబ్ కమిటీ తరఫున ఎలా స్పందించిందనే అంశాన్ని ప్రశ్నించింది. అంతేకాక, మూజేఏ, పౌరులు, ప్రభావిత సమాజాలు లేవనెత్తిన అంశాలను కేబినెట్ సబ్ కమిటీ అధికారికంగా ఎప్పుడైనా చర్చించిందా అనే విషయంపై కూడా స్పష్టత కోరింది.ప్రాజెక్టు అమలుకోసం ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ)గా ఏర్పాటైన ఎంఆర్డీసీఎల్ కు నదీ పరీవాహక ప్రణాళిక, భారీ స్థాయిలో నిర్వాసితత్వం, పర్యావరణ స్థిరత్వం, భూసేకరణ, ప్రజా ఆర్థిక వ్యవహారాలు, ప్రజాస్వామ్య జవాబుదారీతనం వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే రాజకీయ లేదా చట్టబద్ధ అధికారాలు లేవని స్పష్టం చేసింది. సమాధానం ఒక యాంత్రిక ప్రతిస్పందనగా కనిపిస్తోందని ఎంజేఏ అభిప్రాయపడింది. తాము లేవనెత్తిన ప్రధాన అంశాలకు సమాధానం ఇవ్వకుండా, ఇతర అసంబద్ధ వినతులకు సిద్ధం చేసిన సమాధానాలను యాంత్రికంగా పునరావృతం చేసినట్లు కనిపిస్తోందని విమర్శించింది. పర్యావరణ ప్రభావాలు, నిర్వాసితత్వం, ప్రాజెక్టు ఆర్థిక వ్యయభారం, పారదర్శకత, నది జీవావరణ వ్యవస్థ, భూసేకరణ, ప్రజాస్వామ్య సంప్రదింపులు వంటి కీలక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదు. పారదర్శకత, ప్రజా సమాచార బహిర్గతం ఇంకా గైర్హాజరు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పత్రాలను ప్రజల ముందుంచడాన్ని ప్రభుత్వం ఇంకా నిరాకరిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.మా విజ్ఞాపనలో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు, పర్యావరణ ప్రభావ మూల్యాంకన నివేదికలు, జలవిజ్ఞాన అధ్యయనాలు, నది సరిహద్దు పటాలు, వరద మైదానాల అంచనాలు, ఆర్థిక అంచనాలు తదితర ప్రాథమిక పత్రాలను బహిర్గతం చేయాలని ఎంజేఏ డిమాండ్ చేసింది.అయితే, ఈ పత్రాలను విడుదల చేయకుండా వాటిని బహిర్గతం చేయడంపై పరిశీలన జరుగుతోంది అని ఎంఆర్డీసీఎల్ పేర్కొనడం సంతృప్తికరమైన సమాధానం కాదని పేర్కొంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రాజెక్టు సమాచారం ప్రజలకు అందుబాటులో లేకుండా అర్థవంతమైన ప్రజా సంప్రదింపులు జరగవు. ప్రస్తుతం అమలు చేస్తున్న రివర్‌ఫ్రంట్ అభివృద్ధి నమూనాకే అని ఎంజేఏ పునరుద్ఘాటిస్తోంది. ముందే నిర్ణయించిన నమూనాను అమలు చేయడాన్ని పర్యవేక్షించడమే కాక మొత్తం ప్రాజెక్టును సమగ్రంగా పునఃపరిశీలించాలని కేబినెట్ ఉపసమితిని కోరుతున్నాము. అలాగే నిర్వాసితత్వాన్ని, రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గించే ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం-2013ను అసలు రూపంలో అమలు చేయాలని, అందులో తప్పనిసరి సామాజిక ప్రభావ అధ్యయనం నిర్వహించాలని వీజేఏ డిమాండ్ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





