ఫుడ్ పాయిజన్.. 19మందికి అస్వస్థత

– సిరిసిల్ల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులు

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూH Ž17: సిరిసిల్ల పట్టణంలోని మండేపల్లి కేసీఆర్ నగర్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 19 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు లోనవడంతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ పూజం కార్తీక్ మాట్లాడుతూ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పామని తెలిపారు. విద్యార్థులు బయట ఆహారం తీసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు. వైద్యులతో మాట్లాడి బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరినట్లు చెప్పారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు కారణమైన వారిపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కార్తీక్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంశీ, బలగం ఫణికిషోర్, ఎలగందుల శ్రీను, టౌన్ సెక్రటరీ శివ, ధనుష్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *