విదేశాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

  • లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా ఉత్సవాలు
  • అమరులకు నివాళి అర్పించిన ఎన్నారైలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా జరిగాయి. అక్కడి ఎన్నారైలు వైభవంగా వేడుకలు నిర్వహించారు. లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్‌, ‌టాక్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్దు ఎత్తున పాల్గొన్నారు. లండన్‌ ‌లోని హౌంస్లో లో టాక్‌ ‌ప్రధాన కార్యదర్శి సురేష్‌ ‌బుడుగం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు కార్యవర్గ సభ్యులంతా కలిసి కేక్‌ ‌కట్‌ ‌చేసి సంబురాలు జరుపుకున్నారు. ముందుగా తెలంగాణ సిద్దాంత కర్త జయశంకర్‌ ‌చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. టాక్‌ అధ్యక్షుడు రత్నాకర్‌ ‌కడుదుల మాట్లాడుతూ.. ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరుల ఆశయాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలంగాణ రాష్ట్రాన్నిఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు.

గణాంకాల ప్రకారంగా అభివృద్ధి సూచీలో ఎందులో చూసినా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ  మరింత అభివృద్ధి చెందుతుందని రత్నాకర్‌ ‌తెలిపారు. టాక్‌ ‌సంస్థ చేస్తున్న సాంస్కృతిక సేవ కార్య క్రమాల గురించి వివరించారు. టాక్‌ ఉపాధ్యాక్షురాలు శుషుమన రెడ్డి మాట్లాడుతూ.. టాక్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, మేమంతా కేవలం నేడు సంబరాలకు పరిమితం కాకుండా, నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ‌ముఖ్య నాయకులు అబూ జాఫర్‌ ‌వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు. కార్యక్రమంలో టాక్‌ ఉపాధ్యక్షుడు సత్య చిలుము, అడ్వైజరీ చైర్మన్‌ ‌మట్టా రెడ్డి, టీఆర్‌ఎస్‌ ‌లండన్‌ ఇం‌చార్జి నవీన్‌ ‌భువనగిరి, టాక్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌నాయకులు మల్లా రెడ్డి , సురేష్‌ ‌బుడుగం, సత్యపాల్‌,‌శ్రావ్‌, ‌సుప్రజ, స్వాతి బుడుగం, రవి రెటినేని, రవి ప్రదీప్‌, ‌సృజన్‌ ‌రెడ్డి, ప్రశాంత్‌, ‌సురేష్‌ ‌గోపతి, హరి నవాపేట్‌, ‌మని తేజ, నిఖిల్‌, ‌జశ్వంత్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

బహరేన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్‌ ‌సెల్‌ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ ‌సెల్‌ ‌ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేక్‌ను కట్‌ ‌చేసి ఆనందోత్సాలతో రాష్టావ్రతరణ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ ‌సెల్‌ అధ్యక్షుడు రాధారపు సతీష్‌ ‌కుమార్‌, ఉపాధ్యక్షుడు వెంకటేష్‌ ‌బొలిశెట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ ‌వన్‌గా నిలిపారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్నదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలు ఆ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు సంగేపు దేవన్న, చెంన్నమనేని రాజేందర్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page