Take a fresh look at your lifestyle.

రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్‌ ‌యూనివర్శిటీ

  • ఏపీలో దేశంలో 3వ ఫిషరీష్‌ ‌వర్శిటీ
  • నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ‌శంకుస్థాపన

అమరావతి: ‌టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని సీఎం జగన్‌ ‌విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని జగన్‌ ‌మండిపడ్డారు. గతంలో పాలనను చూసిన ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో చంద్రబాబు కు, దత్తపుత్రుడికి ప్రజలు బై బై చెప్పారని ఎద్దేవా చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగన్‌ అక్కడి బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌పై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో గెలవలేనన్న భయం, నిరాశ చంద్రబాబుకు ఉందని, ప్రతి మాటలోనూ, చేష్టలోను భయం కనిపిస్తుందన్నారు. నర్సాపురం రూపురేఖలు మార్చేందుకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫిషరీస్‌ ‌యూనివర్శిటీతో నర్సాపురం రూపురేఖలు మారతాయి. ఆక్వారంగం నర్సాపురానికి ఎంత ప్రధానమైందో తెలుసు. ఫిషరీస్‌ ‌వర్శిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయి.

ఆక్వా కల్చర్‌ ‌సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేశంలో 3వ ఫిషరీష్‌ ‌యూనివర్శిటీ ఏపీలో రాబోతుంది. రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్‌ ‌యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీఎం జగన్‌ అన్నారు. ‘’ముమ్మిడివరంలో వేట కోల్పోయినవారికి అండగా నిలుస్తున్నాం. వేట కోల్పోయిన వారికి రెండో దఫా పరిహారం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది. జగనన్న ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అనుకునేలా పాలన చేస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నాం. నేను విన్నాను.. నేను.. ఉన్నాను.. అని చెప్పి హామీని నెరవేరుస్తున్నాం. నర్సాపురంలో దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం’’ అని సీఎం అన్నారు.

Leave a Reply