గోదావరి పుష్కరాలకు రూ.వేయి కోట్లు

– జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
– గంగాధర కాలేజీలో పోస్టుల భర్తీకి ఆమోదం
– కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరు
-కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సంబంధిత పనులకు రూ.వెయ్యి కోట్ల్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్ల మంజూరుకు పచ్చ జెండా ఊపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలపడమేగాక పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయించింది. అస్సాం రైఫిల్స్, బీఎసఎఫ్, సీఐఎసఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసింది. మరోవైపు నిరుద్యోగ యువతకూ మంత్రిమండలి గుడ్ న్యూస్ చెప్పింది. కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరుకు అంగీకారం తెలిపింది. అలాగే కరీంనగర్ జిల్లా గంగాధరలోని డిగ్రీ కళాశాలలో నియామకాలకు అనుమతి ఇచ్చింది. 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన మరో మÖడు పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *