– పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు
న్యూదిల్లీ, మే 23 : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు కేంద్ర ప్రభుత్వం శనివారం పెంచింది. పది రోజుల్లో ధరలు పెంచటం ఇది మూడోసారి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో ఆయిల్ కంపెనీలు ఓ ప్యాట్రన్ ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తున్నది. ఇప్పటివరకు నాలుగు రోజులకు ఒకసారి పెంచాయి. అంటే 15వ తేదీ తర్వాత 19, ఆ తర్వాత 23వ తేదీ. ధరల పెంపు మధ్య నాలుగు రోజుల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నాయి. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అంశంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. గతంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును రాత్రి సమయంలో ప్రకటించేవాళ్లు. రేపటి ఉదయం పత్రికల్లో ఆ వార్త వచ్చేసింది. ఇప్పుడు ఈ విధానం మారింది. అర్థరాత్రి తర్వాత తెల్లవారుజామున ధరల పెంపు ప్రకటన చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల సమయంలోనే ఈ వార్త జనానికి తెలుస్తున్నది. పెంచిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయని ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు అనేది టీవీల్లో, సోషల్ మీడియాలో చూసి మాత్రమే జనం తెలుసుకుంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





