గల్ఫ్ ‘గుల్ఫారం’ బాధితుడి చికిత్సకు ప్రభుత్వ భరోసా

– ఎమ్మెల్యే భూపతి రెడ్డి వైద్యుడు కావడంతో ప్రత్యేక శ్రద్ధ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : స్వగ్రామంలో కల్తీ కల్లు (గుల్ఫారం) సేవించే అలవాటు వల్ల దుబాయిలో మానసిక అస్థిరతకు గురైన మొద్దు గంగాధర్Žకు మానసిక వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైౖర్మన్ మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లికి గంగాధర్‌ను స్వదేశానికి తెప్పించాలని, తిరిగొచ్చిన తర్వాత డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) చికిత్స అందించాలని కోరుతూ ఆయన భార్య సుప్రియ ఈనెల 12న హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్‌లో ‘సీఏం ప్రవాసీ ప్రజావాణి’లో వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి ఈమేరకు జీఏడీ ఎన్నారై సెల్ అధికారులకు లేఖ రాశారు. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017 నిబంధనల ప్రకారం గంగాధర్‌ను హైదరాబాద్‌లోని మానసిక ఆరోగ్య సంస్థలో చేర్చుకుని చికిత్స అందిస్తామని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సూపరింటెండెంట్ ఈ నెల 22న ఎన్‌వోసీ జారీ చేశారు. ‘రోగి హాస్పిటల్‌లో చేరిన సమయంలో కుటుంబ సభ్యులు లేదా బంధువులు అతనితో ఉండి బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉంటే మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017లోని సెక్షన్ 86 ప్రకారం ఫ్యామిలీ వార్డులో చేర్చవచ్చు.. కుటుంబ సభ్యులు క్లోజ్డ్ వార్డులో చేర్పించాలని కోరిన పక్షంలో అందుకు అవసరమైన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది’ అని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *