దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక విషయంలో పలు ఊహాగానాలు వెలువడు తున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 25తో ముగియనుంది. ఆయన స్థానంలో ఎవరు ఎన్నికవుతారన్న విషయంలో రాజకీయ వర్గాల్లో రసవత్తరమైన చర్చ జరుగుతున్నది .. సహజంగా రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి కనీసం ఒక నెల ముందు నుండే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభ మవుతుంది.అధికార బిజెపిగాని, కాంగ్రెస్‌గాని ఇప్పటివరకు బహిరంగంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా, ఆయా పార్టీలో అంతర్ఘతం గా చర్చలు జరుగుతున్నాయి. కేవలం ఆంతర్ఘత చర్చలతో పాటు ఇతర పార్టీల నాయకులతో రహస్య సమాలోచన లుకూడా జరుగుతున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుం డడంతో అటు ఎన్డీయే కూటమి, ఇటు యుపియే కూటమిలు ఎవరికి వారు తమ సత్తా చూపెట్టు కోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గతంలో కోవింద్ ఎన్నిక విషయంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆనాటికన్నా బిజెపి రాష్ట్రాల సంఖ్య ఇప్పుడు తగ్గాయి. దానికి తగినట్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీకి సీట్లుకూడా తగ్గాయి. ఈసారి తమ అభ్యర్థిని గెలిపించుకోవడంకోసం బిజెపికి ఇతర పార్టీలను ఆశ్రయించక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికకు ఆనాడు టిఆర్‌ఎస్‌తో పాటు శివసేన, అకాళీదళ్ పార్టీలు మద్దతిచ్చాయి. ఇప్పుడు శివసేన, అకాళీదళ్ పార్టీలు ఎన్డీఏనుండి వైదొలిగాయి. గతంలో మద్దతిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్రంతో సఖ్యతలేదు. గతంలో కేంద్రం విధా నాలను సమర్థిస్తూ వొచ్చిన టిఆర్ ఎస్‌కూడా ఇప్పుడు కేంద్రంపై విరుచుకు పడు తున్నది.
బిజెపికి చెందిన కేంద్ర, రాష్ట్ర నాయకులతో టిఆర్‌ఎస్‌కు నిత్యం గర్షణ పడుతు న్నది.దీంతో గతంలోలాగా తమ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం బిజెపికి అంత సులభతరమేమీ కాకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావి స్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నా యనుకు ంటున్నారు. దేశంలో బిజెపి, కాంగ్రె సేతర కూటమికి కూడా ఇదే మంచి అవకాశమ వుతుందన్న ఊహా గానాలు వినిపిస్తు న్నాయి. ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని నిలబెట్టేందుకు , ఆయా పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధనకు తెలంగాణ సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభిం చినట్లు సమాచారం. ముఖ్యంగా తృణముల్ కాంగ్రెస్, డిఎంకె, శివసేన, సమాజ్‌వాది పార్టీ, సిపిఎం లాంటి పార్టీలతో చర్చలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తున్నది. బిజెపి, కాంగ్రెసేతర పార్టీలు కూటమి కట్టినా, కట్టకున్నా ఆ పార్టీలన్నీ కలిసి ఒక అభ్యర్థిని నిలబెడితే మాత్రం బిజెపికి చిక్కేనంటున్నారు. అందుకే ఎన్డీఏతర పార్టీల మద్దతును కూడ గట్టేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థినే ఎంపిక చేయాలని బిజెపి వర్గాలు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే ప్రతిపక్ష కూటమినుండి మద్దతుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
వీలైతే కూటమి కట్టాలనుకుంటున్న రాష్ట్రాల నుండి, అక్కడి స్థానిక పార్టీల నుండే అభ్యర్థిని ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నవారిని రాష్ట్రపతిగా పదోన్నతి కల్పి స్తుంటారు. ఆ క్రమంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడికే ఆ అవకాశం వొస్తుందనుకుంటున్నారు. వెంకయ్య నాయుడి పదవీకాలంకూడా ఆగస్టుతో ముగియనుంది. ఒక వేళ వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే తెలుగువాడిగా ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలు తప్పకుండా మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదు. అంతేగాక దక్షిణ ప్రాంతం వ్యక్తిగా ఆయనకు దక్షిణాది రాష్ట్రాలవారితో మంచి సంబం ధాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రాధాన్యమిచ్చే అవకా శాలు న్నాయి. అదే జరిగితే ఉపరాష్ట్రప తిగా లోకసభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నా యంటున్నారు. కాని పక్షంలో ఆయన్నే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినా ఆశ్చర్యపడేదిలేదంటున్నారు. ఇదిలా ఉండగా ప్రచారంలోఉన్న పలువురి పేర్లకు భిన్నంగా బిజెపి అనూహ్యంగా కొత్త వ్యక్తులను తెరపైకి తెచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికైతే రాష్ట్రపతి అభ్యర్థులకు నితీష్‌కుమార్, శరద్ పవార్, గులాబ్ నబీ ఆజాద్ లాంటి వారు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ఆపదవి అలంకరిస్తుందో వేచి చూడాల్సిందే.