మహారాష్ట్రలో మహామలుపు

  • రెబల్‌ ‌నేత ఏక్‌నాథ్‌ ‌షిండేకు సిఎం పగ్గాలు
  • మరాఠాలో వ్యూహం మార్చిన బిజెపి
  • అధికారానికి దూరంగా కమలదళం
  • ఉద్దవ్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చామన్న అపవాదుకు దూరం

ముంబై, జూన్‌ 30 : ‌మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారానికి దూరంగా ఉండాలని బిజెపి నిర్ణయించింది. వ్యూహం మార్చి శివసేన రెబల్స్‌కు అదికారం అప్పగించింది. అలాగే కేవలం బయటనుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించంది. దీంతో రెబల్‌ ‌నేత ఏక్‌నాథ్షిండే తదుపరి మహారాష్ట్ర సిఎం కాబోతున్నారు. ఉద్దవ్‌ ‌ప్రభుత్వాన్ని కూలదోసామన్న అపవాదునుంచి బయటపడేదంఉకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శివసేన రెబల్‌ ‌నేత ఏక్‌నాథ్‌ ‌షిండేనే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అని మహారాష్ట్ర బీజేపీ ముఖ్య నేత ఫడణవీస్‌ ‌ప్రకటించారు. సీఎం పదవిని ఫడణవీస్‌ ‌చేపట్టకపోవడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేసిట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా నడిచిన ఈ ’మహా’ సంక్షోభంలో బీజేపీ పాత్ర ఏం లేదని చెప్పుకునే ఉద్దేశంతోనే బీజేపీ షిండేను సీఎంగా ప్రకటించి ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొత్తంగా ఉత్కంఠ వీడి కొన్ని రోజులుగా కొనసాగుతున్న హై డ్రామాకు తెరపడింది.

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఏక్‌ ‌నాథ్‌ ‌షిండే బాధ్యతలు చేపట్టనున్నారు. రాత్రి 7.30గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ ‌కోశ్యారీని కలిసిన అనంతరం డియాతో మాట్లాడిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌తొలుత కేవలం షిండే మాత్రమే ప్రమాణం చేస్తారని ప్రకటించారు. మంత్రివర్గం విషయంలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తొలుత సీఎంగా ఫడ్నవీస్‌, ‌డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా.. షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశించడం జరిగిందన్నారు. కానీ ఉద్దవ్‌ ‌థాక్రే అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకన్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రజా తీర్పునకు విరుద్ధంగా శివసేన తప్పుకుందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. థాక్రే సిద్దాంతాలకు వ్యతిరేకంగా థాక్రే వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page