– టీవీకేలో చేరికకు గ్రీన్ సిగ్నల్
చెన్నై, మే 25: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అన్నాడీఎంకేకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం రాజీనామా చేసి ఆ తర్వాత టీవీకే మంత్రి ఆదవ్ అర్జునను కలిశారు. మరగతం కుమారవేల్, జయకుమార్, సత్యభామ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు సమర్పించారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో టీవీకే ప్రభుత్వానికి సీవీ షణ్ముగం నేతృత్వంలో 20మందికి పైగా అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో ఇప్ప్పుడు రాజీనామా చేసిన వారు కూడా ఉన్నారు. దీంతో మదురాంతకం, ధారాపురం, పెరుందురై నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి. దీంతో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మాజీ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. వరుసగా రెండోసారి అధికారానికి దూరం కావడంతో పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. దాంతో విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో పార్టీ రెండుగా చీలిన సంగతి తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



