– కేంద్రం తీరుపై మండిపడ్డ మల్లికార్జన ఖర్గే
న్యూదిల్లీ, మే 25: దేశంలో రోజురోజుకూ పెరుగుతోన్న ఇంధన ధరలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజూవారీ దోపిడీ వల్ల ఎవరు లాభపడుతున్నారని ప్రశ్నించారు. సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోందని విమర్శించారు. 2014లో రూ.71.41 ఉన్న లీటర్ పెట్రోల్ ధరను మోదీ సర్కారు 2026 నాటికి రూ.102.12కు చేర్చిందని ఎద్దేవా చేశారు. రెండు వారాలలోపే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఇది నాలుగోసారి అని, ఈ రోజువారీ ఇంధన దోపిడీ ఇంకా ముగిసిపోలేదని అన్నారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఇంధనంపై రూ.43 లక్షల కోట్లు దోచుకుందని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగోసారి పెరగడంతో ఈరోజు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ షేర్లు వరుసగా 5.8, 4.44, 3.90 శాతం పెరిగాయన్నారు. ప్రజల అవసరాల కంటే లాభానికే ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ నైజమన్నారు. ఇంధన ధరల పేరుతో రైతుల నుంచి ఎంఎస్‌ఎంఈల వరకు, సమాజంలోని ప్రతీ వర్గం బీజేపీ దోపిడీ భారాన్ని మోస్తోందని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



