బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

ప్రతీప మహారాజు గంగానదీ తీరంలో జపం చేసుకుంటువున్నాడు.  గంగానది స్త్రీ రూపంలో వచ్చి ఆయన తొడపై కూర్చుంది. ‘నన్ను నీభార్యగా స్వీకరింపుము’ అంటూ కోరింది. ప్రతీపుడు తనకు అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్య ఉంది  గావున తనకొర్కె సమంజసం కాదన్నాడు. అదీగాక తాను సంతానం కూర్చుండవల్సిన కుడితొడ మీద కుర్చుంది గావున, తన కుమారుడికి భార్య కావల్సిందన్నాడు. గంగ అందుకు అంగీకరించి వెడలిపోయింది.

ప్రతీపుడు తన పుత్రునికి రాజ్యాభిషేకంగావించి, వానప్రస్థానికి వెడుతూ కొడుకుతో ‘నాయనా గంగాతీరంలో ఒక కన్యనన్ను కోరి వచ్చినప్పుడు ఆమెను మన ఇం• •కోడలుగా గ్రహిస్తానన్నాను. ఆమె నిన్నుచేరినట్లయితే, తిరస్కరించకుండా  ఆమె మనసెరిగి ప్రవర్తించవల్సింది’ అని చెప్పాడు. శంతనుడు అలాగేనన్నాడు.
ఒకనాడు శంతనుడు గంగాతీరంలో విహరిస్తూవుంటే ఆ సమయంలో  ఒక దివ్వ సుందర రూపంలో ఉన్న తేజశ్శాలిని కనిపించింది. ఆమె సౌందర్యానికి పరవశుడైనాడు. పరవశంతో ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె కూడా శంతనుడి వంక చూసిముగ్ధురాలై ఉంది. ఇలా ఇద్దరికీ ఒకరిమిద ఒకరికి పరస్పరానురాగం కలిగింది. శంతనుడు ఆమెను సమీపించి తన కోర్కెను తెలియపర్చాడు. గంగా తానేమి చేసినా అభ్యంతరం చెప్పరాదన్నది. తన అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటే తాను వెళ్ళిపోతానంది.

ఆ నియమానికి శంతనుడు తన అంగీకారం తెలిపాడు. గంగను విద్యుక్తంగా వివాహం చేసుకున్నాడు. వారికి కొడుకు పుట్టాడు. గంగావాణ్ణి నదిలో పడవేసింది. ఆమెకిచ్చన మాట ప్రకారం శంతనుడు అడ్డుచెప్పలేదు. ఆ విధంగా ఏడుగురు మగశిశువుల్ని కని గంగ నదిపాలు చేసింది..ఎనిమిదవసారి కూడా కొడుకుపుట్టాడు. వాడినికూడా నదిలో పారవేయాలనుకుంది. కానీ శంతనుడు ఈ సారి అంగీకరించలేదు. గంగా అతనికి నియమభంగం కలిగిందని చెప్పి విడిచివెళ్ళిపోతూ ఇలా అంది ‘మహారాజా! నేను గంగానదిని. ఆవిషయం నీకు తెలియదు. నా గర్భంలో అష్టవసువులు జన్మించారు. ఏడుగురినీ గంగలో వేయడం వలన వారికున్న శాపం తీరింది. ఈ ఎనిమిదవాడు కీర్తి మంతుడై వెలుగొందుతాడు.  ఇతడిని నా దగ్గరే కొంత కాలం ఉంచుకుని పంపిస్తాను. అని చెప్పింది.

కొన్నాళ్ళు గడిచాయి. గంగ దగ్గర ఆ బాలుడు పెరిగిపెద్దవాడయ్యాడు. విద్యాబుద్దులు నేర్చాడు. పరశురాముని దగ్గర విలువిద్య నభ్యసించాడు. వశిష్ఠుని వద్ద వేదవేదాంగాలూ నేర్చుకున్నాడు. ఆ తర్వాత గంగ ఆ బాలకుణ్ణి తెచ్చి  శంతనుడికిచ్చింది.   చేసింది.గంగ ఆ బాలుడికి  దేవవ్రతుడు అనే పేరు పెట్టింది.  శంతనుడు దేవవ్రతునికి యువరాజును చేశాడు. కొంతకాలం గడిచింది.

ఒకనాడు శంతనుడు యమునా తీరంలో వేటకోసం వెళ్ళాడు.. అక్కడ ఒకబెస్త కన్యను చూసాడు. ఆమె పేరు సత్యవతి. సౌందర్యవతి, ఆమె సౌందర్యానికి ముగ్దుడైనాడు. శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలను కున్నాడు. ఆమె తండ్రి దాశరాజు వద్దకు వెళ్ళి తన మనసులో మాట చెప్పాడు.
వొచ్చేవారం ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page