విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నత అధికారుల మెప్పు పొందిన నికార్సయిన అధికారి భద్రాద్రి జిల్లా చండ్రు గొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాస్ రావు ను పథకం ప్రకారం గుత్తి కోయలు కత్తితో మెడ కోసి దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేయడం అమానుషం.పొడు వివాదాలతో జరిగిన హత్య గా చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన అన్ని శాకల ప్రభుత్వ ఉద్యోగులను కలచి వేసింది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపడం సంచలనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినది. భద్రాద్రి జిల్లాలోని చండ్రగుంట మండలం బెండలపాడు వద్ద ఎర్రబొడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారనే సమాచారం మేరకు వారు వెళ్లారు. స్థానిక గిరిజన జాతి అయిన గుత్తికోయలు అధికారులు నాటిని మొక్కలను తొలగించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. గతంలో ఓసారి ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా, లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చిందనీ తెలుస్తూ ఉంది.
తాజాగా, ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో మరోసారి మొక్కలు నాటగా, వాటిని ధ్వంసం చేసేందుకు గిరిజనులు యత్నించారు. ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు అడ్డుకోగా, గుత్తికోయలు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అటవీశాఖ సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ ఫారెస్ట్ రేంజర్ ప్రాణాలు వదిలారు.ప్రభుత్వ,అటవీ భూములు కాపాడుతూ విధి నిర్వహణలో రాజీ పడకుండా,ఎన్నో అవార్డులు అందుకున్న ఘనత వారిదే.ఈ సంఘటన ద్వారా అటవీ శాఖ ఉద్యోగులలో ఒకంత భయం ఏర్పడింది.యే రూపకంగా తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనో మదన పడుతూ వున్నారు.అటవీ శాఖ అధికారులు కు తమ వ్యక్తి గత భద్రత కోసం ఆయుధాలను ప్రభుత్వం ఇవ్వక పోవడం కూడా ఇలాంటి సంగటనలు జరగడానికి కారణం గా చెప్పవచ్చు.
పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తగిన విధంగా ఆలోచన చేయాలి.
దట్టమైన అడవిలో ఒక వైపు క్రూర మృగాల తో మరో వైపు గుత్తి కోయలు,మిగతా వారితో అటవీ శాఖ ఉద్యోగులకు ప్రమాదం పొంచి వున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది.ఈ పోడు సమస్య ఒకరిది జీవన పోరాటం మరొకరిది కర్తవ్య నిర్వహణ గా మారింది.గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. తమ భూమిని అటవీ శాఖ వారు లాగే సుకుంటూ వున్నారని,గిరిజనులు,అటవీ భూములను గిరిజనులు ఆక్రమించు కుంటూ వున్నారని అటవీ అధికారులు అంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వము పోడు భూములకు పట్టాల మంజూరు ప్రక్రియ చేపట్టిన దృష్ట్యా సమస్య మరింత ముదురు తూ వుంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే లోకల్ గిరిజనుల కన్న ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చిన గిరిజనులు తో ముఖ్యం గా గుత్తి కోయలు తో ప్రమాదం పొంచి ఉందని తెలుస్తూ ఉంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 150 కి పైగా గుత్తి కోయల గ్రామాలు వున్నాయి.
సుమారు ముప్పయి వేల మంది గత ముప్పయి ఏళ్లుగా అడవులలో నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తూ వున్నారు.వీరు చర్ల,మణుగూరు, బూర్గంపాడు,పాల్వంచ,మూలకాల పల్లి, చండ్రుగొండ,వాజేడు,వెంకటపూర్, పినపాక, టేకుల పల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఇల్లు కట్టుకుని జీవిస్తూ వున్నారు.అడవులను నరికి వేలాది ఎకరాలలో వివిధ పంటలు సాగు చేస్తూ వున్నారు.పోడు వ్యవసాయం వల్ల అటవీ అధికారుల నుండి వీరికి ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.తమకు పట్టాలు వస్తా యో,రావో అనే కోపం తో అటవీ అధికారుల మీద వారు తమ కోపాన్ని ప్రదర్శిస్తూ వున్నారని తెలుస్తూ ఉంది.ఈ ఏడాది మంచిర్యాల,సిరిసిల్ల,నల్గొండ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలో అటవీ అధికారులకు,గిరిజనులకు మధ్య ఈ పోడు వ్యవసాయం మీద రగడ జరిగింది. ప్రభుత్వము కూడా అటవీ అధికారుల మీద దాడులు జరుగుతూ వున్నప్పుడే వారికి తుపాకులు ఇవ్వాలనే ప్రతిపాదన వస్తూ వుంది.తక్షణమే అటవీ అధికారుల కు ఆయుధాల వినియోగం మీద శిక్షణ ఇచ్చి వారి ఆత్మ రక్షణ కోసం ఆయుధాలను ఇవ్వాలి.మరో మారు ఇలాంటి సంగటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మనవి. శ్రీనివాస రావు కుటుంబానికి అండగా ప్రభుత్వం అండగా నిలవాలి.అటవీ అధికారులు మనో నిబ్బరం కోల్పోవద్దు.వారి ఆత్మ కి శాంతి కలగాలని అందరం కోరుకుందాం.
– కామిడి సతీశ్ రెడ్డి, సామాజిక విశ్లేషకులు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,9848445134.